--:-- | Today 28°C · Weather
Breaking

శివాలయం నిర్మాణానికి శంఖుస్థాపన #vvwnews

Jun 25, 2026 0:38 11 views 2

Description

శివాలయం నిర్మాణానికి శంఖుస్థాపన
★డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం
★తన సొంత నిధులతో ఆలయ నిర్మాణం
★పూజా కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు
★వైభవోపేతంగా అల్లిపురం నేరెళ్ల కొనేరులో కార్యక్రమం నిర్వహణ



విశాఖ 32 వ వార్డు అల్లిపురం నేరెళ్ల కోనేరు ప్రాంతంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు సొంత నిధులతో నిర్మిస్తున్న శివాలయం నిర్మాణానికి గురువారం ఉదయం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
ముందుగా గణపతిపూజ, పుణ్యాహవచనం, నవగ్రహపూజ, వాస్తు పూజా కార్యక్రమాలను అర్చకులు వేదమంత్రాలతో శాస్త్రోపేతంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ
శ్రీ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహముతో, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో శివాలయం నిర్మాణం చేయాలనే తన చిరకాల కోరిక నేటితో నిజం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, స్థానిక పెద్దల సమక్షంలో శివాలయం నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం జరిగిందన్నారు.
పెద్దా పురం నుంచి వచ్చిన శిల్పి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఆయన కూడా శివ భక్తులు కావడం విశేషమన్నారు.
నాలుగు నెలల్లో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేతున్నట్లు చెప్పారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా, శక్తివంతంగా ఈ శంఖుస్థాపన కార్యక్రమం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమానికి పుణ్య నదుల నుంచి గంగ ను తీసుకురావడం జరిగిందన్నారు.
నవధాన్యాలు, నవ రత్నాలతో యంత్ర ప్రతిష్ట చేసి ఈ శంఖుస్థాపన కార్యక్రమం చేయడం జరిగిందన్నారు.
ఆ శివ పార్వతుల ఆశీస్సులు, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహముతో తన పరిధి మేరకు ప్రజాలకు సేవ చేస్తున్నట్లు వెల్లడించారు.
అమ్మవారి దేవస్థానానికి తనను చైర్మన్ గా నియమించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కు , అలాగే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ స్పూర్తితో తాను మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.అలాగే
స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ 32వ వార్డు అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారని చెప్పారు.తాను చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఆయన సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలనేది తన ఆకాంక్ష అన్నారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపెట్టారని, అధికారం కోసం మాత్రం కాదని అన్నారు. తన సొంత నిధులతో ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనిషిగా పవన్ కళ్యాణ్ కొనియడబడుతున్నారని తెలిపారు. నేడు డిప్యూటీ సిఎంగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతో సేవ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగరాజు కుటుంబ సభ్యులు నళిని దేవి, కేధర్నాధ్, బదిరీనాధ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Related Videos