--:-- | Today 28°C · Weather
Breaking

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి* #vvwnews

Jun 16, 2026 3:01 5 views 1

Description

*ప్రచురణార్థం*

*గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి*
*ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ*

*గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ గ్రామ పంచాయతీ అండ్ స్వచ్ఛభారత్ వర్కర్ యూనియన్ ఎఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వినతిపత్రం అందించారు*
*గ్రామపంచాయతీ కార్మికులకు గత ఐదు నెలల నుండి బకాయి పడ్డ జీతాలు వెంటనే ఇవ్వాలని.. ఆనందపురం. పద్మనాభం ఇతర మండలాల్లో అక్రమంగా తొలగించిన కార్మికులు వెంటనే విలువ తీసుకోవాలని గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికులుగా గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య సేవలందిస్తున్న కార్మికులు ప్రజల మలమూత్రాలను ఎత్తిపోస్తూ తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నటువంటి కార్మికుల పట్ల పంచాయతీ సెక్రటరీలు వివక్ష చూపించడం తగదని దళిత వర్గాలకు చెందినటువంటి ఈ కార్మికులు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు నెలలు తరబడి కార్మికుల జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు* *ఎదుర్కొంటున్నారు అయ్యా మా జీతాలు రావట్లేదని పంచాయతీ సెక్రటరీల ను అడగగా కార్మికులను విధుల నుండి అక్రమంగా తొలగించి రు*
*తరతరాలగా ఇదే వృత్తిని నమ్ముకుని బతుకుతున్నటువంటి కార్మికులను కష్టపడ్డా జీతాలు ఇవ్వాలని మా ఆకలి బాధలు పట్టించుకోవాలని ఆవేదన తో అధికారులు అడిగితే ఉద్యోగాలను తొలగించడం ఎంతవరకు సమంజసం అని ఆలోచించాలినీ కోరారు*
*విశాఖ జిల్లాలో ఉన్న ఆనందపురం పద్మనాభం భీమిలి. పెందుర్తి మండలాల్లో పనిచేస్తున్న కార్మికులకు బకాయి పడ్డ జీతాలు ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని. కార్మికుల జీతాలను బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించాలని*.
*కార్మికులపై పనిభారం తగ్గించి కొత్త కార్మికులను నియమించాలని కోరారు*
*స్పందించిన ఎమ్మెల్యే గంటా గారికి కృతజ్ఞతలు*
*ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి ఇంటి వద్ద కలిసిన కార్మికుల సమక్షంలో వెంటనే జిల్లా పంచాయతీ అధికారులతో మాట్లాడి జీతాలను రెండు మూడు రోజుల్లో ఇచ్చి విధంగా ఇప్పటికే తొలగించిన కార్మికులని ఎదవిదంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గ్రామపంచాయతీలో ప్రజల సేవలు అందించడంలో కీలక పాత్ర వహిస్తున్న కార్మికుల సేవలు వర్ణి అతీతమణి* *గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని అవసరమైన చర్యలు చేపట్టే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు స్పందించిన ఎమ్మెల్యే గారికి యూనియన్ గౌరవ అధ్యక్షులు పడాల రమణ కృతజ్ఞతలు తెలియజేసిరు*
*ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు పడాల రమణ. అధ్యక్షులు కొండపు ఈశ్వరరావు ప్రధాన కార్యదర్శి పిల్లి .వీర్రాజు. సత్యనారాయణ. అప్పలరాజు. చెల్లూరు కృష్ణ గంగరాజు. సన్యాసిరావు అంజిబాబు. రాజు. పైడమ్మ అప్పారావు తదితరులు పాల్గొన్నారు*

ఇట్లు.....
పిల్లి వీర్రాజు ప్రధాన కార్యదర్శి

Related Videos