పశ్చిమ నియోజకవర్గం ఐటీ జంక్షన్ సంకురుపేటలో శ్రీ పైడిమాంబ అమ్మవారి గ్రామ దేవత పండుగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ కుమార్తె దీపికా శ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్ త్రినాధరావు, ఉపాధ్యక్షుడు తరుణ్, కార్యదర్శి శివ, గౌరవాధ్యక్షుడు కోశెట్టి వెంకటరమణ, అసిస్టెంట్ కార్యదర్శి పట్నాల శ్రీను, కమిటీ సభ్యులు ఆమెను సాదరంగా ఆహ్వానించారు. దర్శనం అనంతరం దీపిక శ్యామల మీడియాతో మాట్లాడుతూ పైడిమాంబ అమ్మవారి ఆశీస్సులు విశాఖ ప్రజలపై చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దర్శనం, ఆలయ ఏర్పాట్లు ప్రతి ఏడాది మాదిరిగా ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు అభినందించారు. అధ్యక్షుడు త్రినాధరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పండగ మహోత్సవానికి సహాయ సహకారాలు అందించారని, వారికి ఈ సందర్భంగా కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి వార్డు అధ్యక్షుడు అజయ్ బాబు, ఆలయ కమిటీ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.