--:-- | Today 28°C · Weather
Breaking

శ్రీ కుంచుమాంబ కనకమహాలక్ష్మి కొత్త మహాలక్ష్మి అమ్మవార్ల పండుగ మహోత్సవ వేడుకలు#vvwnews

Jun 23, 2026 2:17 64 views 1

Description

శ్రీ కుంచుమాంబ కనకమహాలక్ష్మి కొత్త మహాలక్ష్మి అమ్మవార్ల పండుగ మహోత్సవ వేడుకలు మాధవధారలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం కుంచుమాంబ అమ్మవారి ప్రధాన పండుగ మహోత్సవం లో భాగంగా నేల వేషాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ ప్రాంతం అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సనపల వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా అమ్మవారి జాతర వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ముగ్గురు అమ్మవార్ల పండుగ 18వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి అన్నారు. నేడు కుంచుమాంబ అమ్మవారి ప్రధాన పండుగ సందర్భంగా మాధవధార కళింగ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మాధవధార మానవసేవే మాధవసేవ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రసాద్ వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ ఉత్సవానికి పలువురు పెద్దలతో పాటు గ్రామస్తులు కమిటీ సభ్యులు సహాయ సహకారాలతో వేడుకగా జరుగుతున్నాయన్నారు.

Related Videos