విత్తనాల బంతులతో పచ్చదనం పెంపొందించుదాం అని ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం విశాఖపట్నం లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో సిఇఒ పి విజయకుమార్ ఆధ్వర్యంలో, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ నేతృత్వంలో విత్తనాల బంతులు తయారు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేయాలి అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విత్తనాల బంతులు తయారు చేయడం జరిగుతోందని వివరించారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ నలబై ఏళ్లు విత్తనాల బంతులు విద్యార్థులతో చేయడం జరుగుతుంది అన్నారు. మనమంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకం అని వివరించారు
విశాఖపట్నం చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐ కాశీ విశ్వనాథ్ రాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవాలి అని వివరించారు. విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచుదాం అని కోరారు.
జివిఎంసి అడిషనల్ కమిషనర్ వర్మ మాట్లాడుతూ ప్రకృతి వనరుల పరిరక్షణ మానవాళి బాధ్యత అని పేర్కొన్నారు. జివిఎంసి చాలా కాలంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ తొ కలిసి విత్తనాల బంతులు తయారు చేయడం జరిగుతోంది అని వివరించారు.
ఈ కార్యక్రమంలో వనమాలి సిటిజి అడ్మిన్ లు అరుణ, సరిత లు, ఏరియా లో అడ్మిన్ లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చీఫ్ మేనేజర్ కళ్యాణి, సీనియర్ మేనేజర్ నిమ్మకాయల మూర్తి, ఏక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి ఐ కృష్ణ కుమారి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, సమన్వయకర్తలు పి. మాలతి, పి భాస్కర్, జె రాజేశ్వరి తదితరులు విత్తనాల బంతులు తయారు చేయడం జరిగింది.