--:-- | Today 28°C · Weather
Breaking

మధ్య తరగతి ప్రజలకు సెక్షన్ 22ఏ తో తీవ్ర ఇబ్బందులు* #vvwnews

Jun 22, 2026 3:23 15 views 1

Description

*మధ్య తరగతి ప్రజలకు సెక్షన్ 22ఏ తో తీవ్ర ఇబ్బందులు*

*స్థానిక ఎమ్మెల్యేలతో పాటు మంత్రి నారా లోకేష్ కు కూడా సంబంధం ఉందని ఆరోపించారు*

*వరుణ్ హాస్పిటాలిటీ సంస్థ కోసం ప్రత్యేక జీవోలు*

*జీవో 153 ప్రకారం నిబంధనలను సడలించారు.*

---- *తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్*

విశాఖపట్నం: మధ్య తరగతి ప్రజలకు చెందిన అనేక భూములను సెక్షన్ 22ఏ జాబితాలో చేర్చడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ అన్నారు. అనారోగ్య సమస్యలకు వైద్యం చేయించు కోలేకపోవడం, పిల్లలకు పెళ్లిళ్లు చేయ లేకపోవడం నిలిచిపోయాయన్నారు. ఆర్థికంగా బలోపేతమై ఉన్న పెద్దలకు ఒక న్యాయం.. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఒక న్యాయం సరికాదన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని రామ్ అభిప్రాయపడ్డారు. లక్షలాది రూపాయలు విలువ చేస్తే భూమిని అతి తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వం కేటాయించిందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తీవ్ర మైన అభ్యంతరం చేశారు. ఇదే విషయంపై సోమవారం మధ్యాహ్నం పి.జి.ఆర్.ఎస్ లో జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ కు ఒక నివేదిక సమర్పించారు. అనంతరం మీడియాతో బి.వి.రామ్ మాట్లాడుతూ.. విశాఖ బీచ్ రోడ్ మహారాణిపేట లోని టీ.ఎస్ నెంబర్ 1200 లో కేవలం 47 వేల రూపాయలు చొప్పున 1236 గజాల స్థలాన్ని వరుణ్ హాస్పిటాలిటీస్ సంస్థకు చౌకగా అప్పగించారన్నారు. జీ ఓ నెంబర్ 86 ప్రకారం 2019 ఫిబ్రవరి 5వ తేదీన అప్పటి టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారం కొనసాగిందన్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్లలోపు నిర్మాణం పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జీవో నెంబర్ 86 విడుదల చేసిన కొద్ది రోజులకే జీవో నెంబర్ 153 ను కొత్తగా తీసుకువచ్చారన్నారు. 153 జీవో ప్రకారం నిబంధనలను సడలించారన్నారు. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం కోల్పోవడం, వైసిపి అధికారంలోకి రావడంతో సదరు సంస్థ నిర్మాణాన్ని ప్రారంభించలేదన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ తన తల్లి తోపాటు హాజరయ్యారని రామ్ ప్రస్థావించారు. వ్యవహారంలో విశాఖలోని ఎమ్మెల్యేలకు కూడా హస్తముందన్నారు. వాస్తవానికి ఆ 1236 గజాల స్థలాన్ని బహిరంగంగా అమ్మకానికి పెడితే కనీసం రెండు లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని అన్నారు.

Related Videos