--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ కిమ్స్‌లో రాష్ట్రంలోనే తొలి స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ క్లినిక్ ప్రారంభం #vvwnews

Jun 26, 2026 8:17 6 views 1

Description

విశాఖ కిమ్స్‌లో రాష్ట్రంలోనే తొలి స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ క్లినిక్ ప్రారంభం
*సీపీ డా. శంఖ బత్ర బాగ్చి ముఖ్య అతిథిగా ప్రారంభించారు_
*క్రీడా గాయాలకు ఒకే చోట సంపూర్ణ చికిత్స

విశాఖపట్నం, జూన్ 26:
క్రీడాకారులు, ఫిట్నెస్ ప్రియులకు వరంగా కిమ్స్ హాస్పిటల్స్, సీతమ్మధారలో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ క్లినిక్ శుక్రవారం ప్రారంభమైంది.
విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డా. శంఖ బత్ర బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై క్లినిక్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఆటల సమయంలో, రోజువారీ జీవితంలో తగిలే గాయాలు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఇటీవల విశాఖలో క్రీడలు, ఫిట్నెస్ పట్ల యువత ఆసక్తి బాగా పెరిగిందని, అనుకోకుండా వచ్చే గాయాలకు అత్యాధునిక సాంకేతికతతో అన్ని సేవలు ఒకే చోట అందుబాటులోకి రావడం గొప్ప విషయమన్నారు.
కన్సల్టెంట్ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపిక్ స్పెషలిస్ట్ డా. శ్రీనివాస్ గొల్లంగి మాట్లాడుతూ క్లినిక్ ప్రత్యేకతలు వివరిస్తూ
క్రీడా గాయాల నిర్ధారణ, చికిత్స ఆర్థ్రోస్కోపిక్ సర్జరీలు,
ఫిజియోథెరపీ, పునరావాస సేవలు
నిపుణుల సలహాలు ఆస్పత్రిలో ఒకే చోట లభిస్తాయని తెలిపారు.
క్రికెట్, బ్యాడ్మింటన్, ట్రెక్కింగ్, హైకింగ్, రన్నింగ్, మారథాన్, సైక్లింగ్, జిమ్ వ్యాయామాల వల్ల యువతతో పాటు మధ్యవయస్కుల్లోనూ మోకాళ్లు, భుజాలు, కండరాలు, లిగమెంట్ల గాయాలు పెరుగుతున్నాయని తెలిపారు.గతంలో ఓపెన్ సర్జరీలతో రికవరీకి ఎక్కువ సమయం పట్టేదని, ఇప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సాంకేతికతతో కెమెరా ద్వారా 360 డిగ్రీల్లో గాయాన్ని చూసి చిన్న కోతతోనే సర్జరీ చేయగలుగుతున్నామని వివరించారు. దీంతో రోగి త్వరగా కోలుకోగలరన్నారు. క్రీడా గాయాల నిర్ధారణ, చికిత్స, ఫిజియోథెరపీ, పునరావాస సేవలను ఒకే వేదికపై అందించేందుకు ఈ ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గాయం ప్రారంభంలోనే వస్తే చాలా సందర్భాల్లో సర్జరీ అవసరం లేకుండానే పరిష్కారం చూపగలమన్నారు.
కిమ్స్ హాస్పిటల్స్ సీతమ్మధార రీజినల్ సీఈఓ డా. నగేష్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే పలు మల్టీ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నామని, ఈ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ క్లినిక్‌తో క్రీడాకారులు, ఫిట్నెస్ ప్రేమికులకు మరింత మెరుగైన వైద్య సహాయం లభిస్తుందని తెలిపారు. క్రీడా గాయాల బాధితులకు ఈ క్లినిక్ కొత్త ఆశగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు డా. రాజేష్ కుమార్ రెడ్డి, డా. సంతోష్ రామ్, డా. రామరాజు, డా. వసంత బాబు, డా. అశీష్ కుమార్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Related Videos