--:-- | Today 28°C · Weather
Breaking

ఆదిఆంధ్ర సేవా సంఘం ఆధ్వర్యంలో పైడిమాంబ అమ్మవారి జాతర #vvwnews

Jun 23, 2026 3:26 136 views 8

Description

ఆదిఆంధ్ర సేవా సంఘం ఆధ్వర్యంలో
పైడిమాంబ అమ్మవారి జాతర


ఆది ఆంధ్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ పైడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఉత్తర నియోజకవర్గం 51 వ వార్డు మ్యారేట్ హోటల్ ఎదురుగా అంబేద్కర్ కాలనీ గ్రామస్తులు, కమిటీ సభ్యులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 51 వ వార్డు బిజెపి ఉపాధ్యక్షుడు, విష్ణు సేన అధినేత ఎస్ బంగారు రాజు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సహాయ సహకారాలతో అమ్మవారి జాతర అంబరాన్ని అంటిందన్నారు. తెల్లవారుజాము నుండే అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని, ప్రతి ఏడాది మాదిరిగా సాయంత్రం పరస మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్ కాలనీ అమ్మవారి ఆలయం వరకు విద్యుత్ అలంకరణతో తీర్చిదిద్దారు. దర్శన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Related Videos