--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ ఫిషింగ్ హర్బార్ దగ్గర ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ గంగాభవాని పండగ

Jul 1, 2026 4:55 10 views 1

Description

విశాఖ ఫిషింగ్ హర్బార్ దగ్గర ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ గంగాభవాని పండగ ఘనంగా నిర్వహించారు శ్రీ గంగాభవాని చేపల వేలం దారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈవేళ మూడోవారం అవ్వడం వల్ల అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి భారీ ఎత్తున మేళ తాళాలతో ఊరేగింపుగా అమ్మవారి గుడికి దగ్గరికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ముగి రాజాకుమార్ (రాజా)మాట్లాడుతూ గత 40 సంవత్సరాలు బట్టి ఈ అమ్మవారికి ముక్కులు తీర్చుకుంటామని అలాగే ఈ తల్లి మమ్మల్ని మా కుటుంబాలని చల్లగా చూస్తాదని అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తల్లి కరుణ మా మీద ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుంపఈశ్వరరావు,జోగి సుధాకర్, నూకరాజు, కాశరపు రాంబాబు,జోగి సతీష్, పాల్గొనడం జరిగింది. ఈ పండుగ వాతావరణం లో భారీ ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగింది.

Related Videos