--:-- | Today 28°C · Weather
Breaking

97వ వార్డు పాపయ్య రాజుపాలెం పార్క్ స్థలాన్ని కాపాడండి మహా ప్రబో అంటూ రోడ్డెక్కిన స్థానికులు

Jun 29, 2026 4:29 1 views 1

Description

విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఎన్ని పర్యాయాలు విన్నవించుకుంటున్న,,, మరిన్నిసార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్న అధికారులు పట్టించుకోపోవడంతో గ్రామస్తులంతా స్థానికులతో కలిసి నిరసన ప్రదర్శనకు దిగారు... తమ వద్ద ఉన్న ఆధారాలను విలేకరుల ముందు ప్రదర్శిస్తూ,, అక్రమ నిర్మాణాలను అడ్డుకొని కబ్జాను నిలువరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు... అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ, అన్ని రకాల వసతులు ఉన్నాయని ధీమాతో స్థలాలు కొనుగోలు చేశామని తీరా ఇప్పుడు చూస్తే తమ పిల్లలకు కేటాయించిన ఆటస్థలం కబ్జాకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు...అలాగే ప్రధాన రహదారిని కలుపుతూ కేటాయించిన రోడ్డు ప్రాంతం కూడా ఆక్రమణకు గురవడం తమని ఆవేదన గురి చేస్తుందని వాపోయారు... ఈ అంశాన్ని అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం కానరావడం లేదని ఆరోపించారు.. భవిష్యత్తు అవసరాల దృశ్య కేటాయించిన ఈ స్థలాల పట్ల కార్పొరేషన్ వారి తీరులు తూర్పారబెట్టారు... ఈ విషయంపై వెంటనే తగిన న్యాయం జరగకుంటే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు...

Related Videos