--:-- | Today 28°C · Weather
Breaking

ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేయాలి #vvwnews

Jul 1, 2026 4:13 9 views 3

Description

ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేయాలి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం విశాఖపట్నం లోని పెందుర్తి మండలం పెద్ద గాడి దగ్గర ఉన్న సంకల్ప కళా గ్రామంలో వ్యవస్థాపకులు ఆకుల చలపతిరావు నేతృత్వంలో విత్తనాల బంతులు తయారు చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేయాలి అని కోరారు. శీతోష్ణస్థితి వేడెక్కుతున్న నేతృత్వంలో విత్తనాల బంతులు చేయడం ద్వారా సామాజిక వనాలు పెంచుదాం అన్నారు. దేశీయ విత్తనాలు పరిరక్షణకు కృషి చేయాలి అని కోరారు. అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఆకుల చలపతిరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని పేర్కొన్నారు. విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచుదాం అన్నారు. ప్రకృతి వనరుల పరిరక్షణ మాన బాధ్యత అని వివరించారు. తాము చాలా కాలంగా విత్తనాల బంతులు తయారు చేయడం జరిగుతోంది అని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి ఐ కృష్ణ కుమారి, సంకల్ప కళా గ్రామం ప్రతినిధి జమీలియా, కాగజ్ అవర్ కళా సంస్థ వ్యవస్థాపకులు సృష్టి, ప్రకృతి రైతు కొటాన నరేష్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంకల్ప సంస్థ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విత్తనాల బంతులు తయారు చేయడం జరిగింది.

Related Videos