--:-- | Today 28°C · Weather
Breaking

వైఎస్సార్‌సీపీని గెలిపించి వార్డును బహుమతిగా ఇస్తాం: సారంగధరుడు ll VVW news

Oct 22, 2026 2:56 39 views 1

Description

వైఎస్సార్‌సీపీని గెలిపించి వార్డును బహుమతిగా ఇస్తాం: సారంగధరుడు

విశాఖపట్నం: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం ప్రజల్లో ఉంటామని జీవీఎంసీ 60వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి, రిటైర్డ్ మేజర్ పాతిన సారంగధరుడు అన్నారు. వార్డు పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, గత 15–18 ఏళ్లుగా మాధవధార ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, ప్రజాసేవను మరింత విస్తృతం చేసేందుకే బరిలోకి దిగినట్లు తెలిపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ఒక్క ఫోన్ కాల్‌తో అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణితో పాటు తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు సోనీ, సుజాత, హేమ, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Videos