--:-- | Today 28°C · Weather
Breaking

ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ స్పోర్ట్స్ ఇంచార్జ్ ప్రొఫెసర్ డాక్టర్ జి.కృష్ణారెడ్డి జయంతి వేడుకలు#vvwnews

Jun 23, 2026 1:50 6 views 2

Description

*ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ స్పోర్ట్స్ ఇంచార్జ్ ప్రొఫెసర్ డాక్టర్ జి.కృష్ణారెడ్డి జయంతి వేడుకలు..*

ఆంధ్ర యూనివర్సిటీ స్పోర్ట్స్ ఇంచార్జ్ ప్రొఫెసర్ డాక్టర్ జి.కృష్ణారెడ్డి జయంతిని పురస్కరించుకుని కృష్ణారెడ్డి కుమారుడు జి.కృష్ణకాంత్ రెడ్డి, కుటుంబ సభ్యులు డాబాగార్డెన్ లో ఉన్న ప్రేమ సమాజంలోని అనాథ పిల్లలందరికీ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుమారుడు కృష్ణ కాంత్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ జి.కృష్ణారెడ్డి జయంతి సందర్భంగా ప్రేమ సమాజంలో అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. తమ కుటుంబ సభ్యులందరి పై ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరారు. ప్రేమ సమాజంలో పిల్లలతో సమయాన్ని గడపడం తమ కుటుంబ సభ్యులందరికీ ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి స్వయంగా పిల్లలందరికీ ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో రుచికరమైన భోజనాన్ని వడ్డించారు. భోజనానికి ముందు పిల్లలందరూ క్రమశిక్షణతో దైవ ప్రార్థన చేయడం అక్కడ ఉన్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది. పిల్లల మొఖాల్లోని ఆనందం వారిని ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు జి.స్నేహలతారెడ్డి, పూజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Videos