--:-- | Today 28°C · Weather
Breaking

కొడుకు ఎదుగుదల కోసం దేశ ప్రథమ పౌరురాలికి ఘోర పరాభవం!* #vvwnews

Jun 30, 2026 4:01 14 views 1

Description

*ఆంధ్రప్రదేశ్ గడ్డపై రాష్ట్రపతిని ఘోరంగా అవమానించడమే*

*రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన*

*ఒక ప్రథమ పౌరురాలిని ఇలాగేనా గౌరవించుకునేది?*

*అధికారిక నిబంధనలను ఇంతలా బేఖాతరు చేస్తారా?*

*కొడుకు ఎదుగుదల కోసం దేశ ప్రథమ పౌరురాలికి ఘోర పరాభవం!*

*ఏ అధికారిక హోదాతో నారా లోకేష్ రాష్ట్రపతికి ప్రోటోకాల్ పరిధిని దాటి స్వాగతం పలికారని నిలదీశారు*

*రాష్ట్రంలో లోకేష్ వెనుక ఉండి నడిపించే ‘షాడో సీఎం’ లా వ్యవహరిస్తున్నారు*

– *తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ రౌద్రరూపం*

బెంగళూరు: కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ ప్రథమ ఘన ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ తొలి పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం విచ్చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రోటోకాల్ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కిందని తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ తీవ్రస్థాయిలో ఒక ప్రైవేట్ హోటల్, బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. పక్కాగా నిర్దేశించిన అధికారిక ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం... దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని అత్యున్నత అధికారిక స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే, ఆ నిబంధనలను పక్కనబెట్టి, ఆయన రాకుండా నారా లోకేష్ బృందం ముందడుగు వేయడం వింతగా, విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఒక ప్రథమ పౌరురాలిని ఇలాగేనా గౌరవించుకునేది? అధికారిక నిబంధనలను ఇంతలా బేఖాతరు చేస్తారా?" అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక ప్రోటోకాల్ నియమావళి ప్రకారం... ఒకవేళ అత్యవసర కారణాల వల్ల ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే, ఆ తదుపరి అత్యున్నత హోదాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతను స్వీకరించి స్వాగతం పలకాల్సి ఉంటుంది. ఆయన కూడా ఒంట్లో బాగోలేక రానప్పుడు ముఖ్యమంత్రి తప్పక హాజరుకావాల్సి ఉంటుందని బి.వి.రామ్ స్పష్టం చేశారు. అసలు ఏ రాజ్యాంగ అర్హతతో, ఏ అధికారిక హోదాతో నారా లోకేష్ రాష్ట్రపతికి ప్రోటోకాల్ పరిధిని దాటి స్వాగతం పలికారని ఆయన సూటిగా నిలదీశారు. ఇది నారా చంద్రబాబు నాయుడు తన కొడుకును రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం కోసం ముందే వేసుకున్న పక్కా వ్యూహంతో చేస్తున్న రాజకీయ ఆట అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోకేష్ వెనుక ఉండి నడిపించే ‘షాడో సీఎం’ లా వ్యవహరిస్తున్నారనడానికి ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన సంఘటనే సజీవ సాక్ష్యమని ధ్వజమెత్తారు. "అంతగా కావాలనుకుంటే లోకేష్‌ను ఇప్పుడే సీఎం చేసేయొచ్చు కదా, మిమ్మల్ని ఎవరు కాదంటారు?" అంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.
దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి విశాఖపట్నం వస్తే, అధికారిక హోదా లేని ద్వితీయ శ్రేణి నాయకులతో స్వాగతం పలికించి ప్రోటోకాల్‌ను దిగజార్చడం అంటే ఆంధ్రప్రదేశ్ గడ్డపై రాష్ట్రపతిని ఘోరంగా అవమానించడమే అవుతుందని బి.వి.రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా, మర్యాదల పరంగా ఇప్పటివరకు తెలుగువారు చరిత్రలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారని, కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఇలాంటి దిగజారుడు పనులు చేయడం అస్సలు మంచిది కాదని హితవు పలికారు. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన మొత్తం తెలుగుజాతి చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోతుందని హెచ్చరించారు. దేశ తొలి పౌరురాలికి జరిగిన ఈ పరాభవాన్ని చూస్తుంటే, ఆమె గిరిజన తెగకు చెందిన మహిళ కాబట్టే ఇలాంటి వివక్ష చూపించారా అనే అనుమానం కలుగుతోందని, ఇదే నిజమైతే ఇది మొత్తం గిరిజన జాతినే కించపరచడమేనని బి.వి.రామ్ ముఖ్యమంత్రిని గట్టిగా ప్రశ్నించారు.

Related Videos