ఎఐటియుసి 107వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేఆర్ఎం కాలనీలో కే నూకరాజు జండా ఆవిష్కరించారు
Description
ఎఐటియుసి 107వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేఆర్ఎం కాలనీలో కే నూకరాజు జండా ఆవిష్కరించారు పది గంటలకి టిఎస్ఆర్ కాంప్లెక్స్ వద్ద రావికృష్ణ ఐటిసి ఎర్రజెండా ఆవిష్కరించారు 11 గంటలకి అక్కయ్యపాలెం నరసింహనాగరం లో జెండా పి సాయికుమార్ గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జీ వామనమూర్తి మాట్లాడుతూ 1925 అక్టోబర్ 31న భారతదేశంలో అఖిలభారత్ కార్మిక సంఘం ఏఐటియుసి ఏర్పడి నాడు దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని కార్మికులు ఉద్యోగులకు చట్టాలు చేయాలని ప్రభుత్వ రంగ పరిశ్రమలు స్థాపించాలని అనేక ఉద్యమాలు నడిపిన ఘనత ఏఐటియుసి ఎర్రజెండాకే దక్కుతుందని కొనియాడారు నేడు కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో టిడిపి జనసేన బిజెపి అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు గడిచిన కార్మిక హక్కులు కాపాడటంలో నిర్లక్ష్యం చేస్తున్నయని మండిపడ్డారు బియ్యం పప్పులు వంట నూనె ధరలు భారీగా పెంచి ప్రజలపై ఆర్థిక భారాలు వేస్తున్నాయని ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు మౌనం వహించడం విచారకరం పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో య శివాజీ దేవుడు నాగరాజు రావి కన్నారావు జి నీలకంఠం పి సూర్యారావు నాయుడు భాష సలీం మల్లేశులు పాల్గొన్నారు ఇట్లు జి వామనమూర్తి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు