--:-- | Today 28°C · Weather
Breaking

గాజువాక ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆధునిక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు #vvwnews

Jul 10, 2026 5:55 0 views 0

Description

*ఎమ్మెల్యే గణబాబు*

విశాఖ జిల్లా,గాజువాక ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆధునిక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.ఈ నిర్మాణ పనులను ఎమ్మెల్యే గణబాబు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాలో విద్యుత్ బస్సుల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కాలుష్యం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని చెప్పారు. గాజువాక డిపోలో నిర్మిస్తున్న ఛార్జింగ్ స్టేషన్ పూర్తయితే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ మరింత సులభంగా మారుతుందని, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు.ఇటునుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి సిహెచ్ రామ్మోహన్ నాయుడు,ఎన్ఎంయు నేత పిల్లా శంకరరావు,కోరాడ శ్రీనివాస్,జోగి,విద్యుత్,ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు

Related Videos

చిన్నారులకు ఆధునిక గుండె వైద్యం మరింత చేరువ #vvwnews
Jul 10, 2026

చిన్నారులకు ఆధునిక గుండె వైద్యం మరింత చేరువ #vvwnews

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ – విశాఖపట్నం చిన్నారులకు ఆధునిక గుండె వైద్యం మరింత చేరువ విశాఖపట్నం, జూలై 10, 2026: ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులకు అత…

Watch Now