--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ,మురళీనగర్ రామాలయంలో వైభవంగా సరస్వతి దేవి అలంకారంలో లలితమ్మ తల్లికి దసరా సారే సమర్పణ.

Oct 16, 2026 3:52 7 views 1

Description

విశాఖ,మురళీనగర్ రామాలయంలో వైభవంగా సరస్వతి దేవి అలంకారంలో లలితమ్మ తల్లికి దసరా సారే సమర్పణ.
దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలలో భాగంగా మురళీనగర్ లోని స్థానిక రామాలయంలో కొలువుదీరిన శ్రీ లలితమ్మ తల్లి, ఈరోజు సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో "దసరా సారే" సమర్పించారు.
ట్రస్ట్ ప్రతినిధులు అమ్మవారికి పసుపు-కుంకుమలు, పట్టుచీర, జాకెట్ ముక్క, గాజులు, వివిధ రకాల పూలు, పూలదండలు, కొబ్బరికాయలు, అరటిగెల, పండ్లు, ప్రసాదం కొరకు స్వీట్స్, స్వీట్ ప్యాకెట్లు మరియు బియ్యం బస్తాను మంగళవాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ విశేష పూజా కార్యక్రమంలో ట్రస్టు ఫౌండర్ శ్రీమతి డా: కుప్పిలి కీర్తిపట్నాయక్ , మాణాపురం రమాదేవి, మధుల్యాబ్ మధు, శ్రీలేఖ, కుప్పిలి రమాభాయి, షణ్ముకి ఫణిభూషణి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భానుమూర్తి పంతులు, శ్రీ గోపి పంతులు గార్ల వేదమంత్రాల నడుమ పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ వేడుకలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
భవదీయురాలు,
కుప్పిలి కీర్తిపట్నాయక్,
ఫౌండర్, శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్టు.

Related Videos

విశాఖ దక్షిణ నియోజకవర్గం 39 వ వార్డు తరఫునుంచి నామినేషన్ వేసిన బాపు ఆనంద్.
Oct 16, 2026

విశాఖ దక్షిణ నియోజకవర్గం 39 వ వార్డు తరఫునుంచి నామినేషన్ వేసిన బాపు ఆనంద్.

👉🏻👉🏻👉🏻 విశాఖ దక్షిణ నియోజకవర్గం 39 వ వార్డు తరఫునుంచి నామినేషన్ వేసిన బాపు ఆనంద్. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, వాసుపల్లి గణేష్ కుమార్ ఆశీస్స…

Watch Now
బ్యాలెట్ పద్ధతిలో జీవీఎంసీ ఎన్నికలు.. కమిషనర్ ప్రకటన ll.
Oct 16, 2026

బ్యాలెట్ పద్ధతిలో జీవీఎంసీ ఎన్నికలు.. కమిషనర్ ప్రకటన ll.

1\. మున్సిపాలిటీలకు ఆర్థిక పునర్‌వైభవం తీసుకొస్తాం: విజయ్‌కుమార్ 2\. బీసీ మహిళకు మేయర్ అభ్యర్థిగా జగన్ అవకాశం 3\. బ్యాలెట్ పద్ధతిలో జీవీఎంసీ…

Watch Now
బీసీ మహిళకు మేయర్ అభ్యర్థిగా జగన్ అవకాశం ll VVW NEWS
Oct 16, 2026

బీసీ మహిళకు మేయర్ అభ్యర్థిగా జగన్ అవకాశం ll VVW NEWS

1\. మున్సిపాలిటీలకు ఆర్థిక పునర్‌వైభవం తీసుకొస్తాం: విజయ్‌కుమార్ 2\. 3\. బ్యాలెట్ పద్ధతిలో జీవీఎంసీ ఎన్నికలు.. కమిషనర్ ప్రకటన 4\. మహిళల ఆర్థ…

Watch Now
అనకాపల్లిలో రూ.70 లక్షల గంజాయి పట్టివేత ll VVW News
Oct 16, 2026

అనకాపల్లిలో రూ.70 లక్షల గంజాయి పట్టివేత ll VVW News

6\. విజయనగరంలో కూటమికి అభ్యర్థులే లేరా? బెల్లాన చంద్రశేఖర్ 7\. అనకాపల్లిలో రూ.70 లక్షల గంజాయి పట్టివేత 10\. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మ…

Watch Now