--:-- | Today 28°C · Weather
Breaking

*చంద్రబాబు నాయుడు ను విమర్శిస్తుంటే పల్లా కనీసం నోరు మెదపడం లేదు*

May 4, 2025 2:02 8,537 views 12

Description

*చంద్రబాబు నాయుడు ను విమర్శిస్తుంటే పల్లా కనీసం నోరు మెదపడం లేదు*

*వైసిపి కోవర్టుగా మారిన పల్లాను ను తక్షణమే అధ్యక్ష స్థానం నుంచి తొలగించాలి*

*----- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్*

విశాఖపట్నం: "నా చంద్రబాబు నాయుడు ను వైసిపి నాయకులు విమర్శిస్తున్నప్పటికీ కనీసం నోరు మెదపలేని స్థితిలో.. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అ పల్లా శ్రీనివాస రావు ఉన్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. పల్లా శ్రీనివాస రావు వైసిపి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని రామ్ తెలిపారు. ఆదివారం ఉదయం హోటల్ దస్పల్లాలో " కాఫీ విత్ పల్లా శ్రీనివాసరావు బై బి.వి.రామ్ " పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాస్తవానికి తనపై పల్లా శ్రీనివాసరావు, అతని అనుచరులు చేస్తున్న ఆరోపణలపై ముఖాముఖి చర్చకు హోటల్ దసపల్ల వేదికగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. అయితే పల్లా శ్రీనివాస రావు గాని ఆయన అనుచరులు గాని కాఫీ విత్ పల్ల కార్యక్రమానికి హాజరు కాలేదు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు.. నిరీక్షించిన అనంతరం బి.వి.రావ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పై ఇష్టానుసారంగా విమర్శలు చేసిన గుడివాడ అమర్ అక్రమ నిర్మాణాన్ని కూల్చకపోతే నీకు వచ్చిన నొప్పి ఏంటి అని పల్లా అనుచరులు తనను ప్రశ్నిస్తున్నారని.. అంటే వైసిపి అక్రమాలకు పల్లా కొమ్ము కాస్తున్నట్టు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా చేతకాని ప్రగల్బాలు పలకడం పల్లాకు, అతని అనుచరులకు అలవాటుగా మారిపోయింది అన్నారు. ఇటీవల తిరుపతి గోశాలలో గోవుల మృతి నేపథ్యంలో చర్చకు వస్తానని చెప్పిన పల్లా ముఖం చాటేసారని.. రోజా బహిరంగంగానే విమర్శించారన్నారు. తాజాగా సింహాచలంలో ఘటన నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ కనీసం వల్ల శ్రీనివాసరావు స్పందించలేదన్నారు. ఇటువంటి వైసిపి కోవర్టును తక్షణమే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానం నుంచి తొలగించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బి.వి.రామ్ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరైనా వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు.

Related Videos

ఇనార్బిట్ మాల్‌లో హ్యాంప్లీస్‌ కొత్త స్టోర్‌ ప్రారంభంll VVW news
Oct 1, 2026

ఇనార్బిట్ మాల్‌లో హ్యాంప్లీస్‌ కొత్త స్టోర్‌ ప్రారంభంll VVW news

ఇనార్బిట్ మాల్‌లో హ్యాంప్లీస్‌ కొత్త స్టోర్‌ ప్రారంభం విశాఖపట్నం, అక్టోబర్‌ 1 విశాఖ ఇనార్బిట్‌ మాల్‌లో ప్రముఖ బొమ్మల బ్రాండ్‌ హ్యాంప్లీస్‌ న…

Watch Now
అర్హులందరికీ పెన్షన్లు ...ఇంటి పట్టాలు...*  ll VVW News
Oct 1, 2026

అర్హులందరికీ పెన్షన్లు ...ఇంటి పట్టాలు...* ll VVW News

*పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 93వార్డు (కొత్త వార్డ్ 119) లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశా…

Watch Now