సెప్టెంబర్ 1న చలో ఢిల్లీకి కార్మికులు వచ్చి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు
Description
ప్రెస్ నోట్ సెప్టెంబర్ 1న చలో ఢిల్లీకి ప్రజలు తరలిరండి నెయ్యల నాగభూషణరావు పిలుపు సెప్టెంబర్ 1న చలో ఢిల్లీకి ప్రజలు తరలిరావాలని కోరుతూ తేదీ01-8-2026 ఉదయం 10 గంటలకి కంచరపాలెం మెట్టు వద్ద గోడ పత్రిక ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమానికి ఉద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని కోరారు విశాఖను కాలుష్యం ప్రమాదం నుంచి కాపాడాలని గూగుల్ డేటా కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు సిపిఐ ఉత్తర నియోజకవర్గం కార్యదర్శి నెయ్యల నాగభూషణరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా రైతంగ వ్యతిరేక విధానాలకు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న చలో ఢిల్లీకి ప్రజలు కార్మికులు తరలి వచ్చి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత విద్య వైద్యం అందించాలని వికలాంగులు వితంతులు వంటరి మహిళలకు పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు సిపిఐ నాయకులు జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెంచుతున్న డీజలు పెట్రోలు విద్యుత్ వంట గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించి ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఆగస్టు 6 నుండి 15 దాకా రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ చేపట్టే పాదయాత్రలు వీధి మీటింగ్లకు ప్రజలు హాజరై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మల్లయ్య పి ఎల్లాజీ సత్తిబాబు కోన కృష్ణ రావు ఆర్ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు సిపిఐ ఉత్తర నియోజకవర్గం కార్యదర్శి
Related Videos
Aug 1, 2026
వైజాగ్‌లో ‘ఏక్ రాగ’ను ఆవిష్కరించిన ఇంద్రియ, ఆదిత్య బిర్లా జ్యువెలరీ
*భారతీయ సాంస్కృతిక సౌరభాన్ని వేడుకగా మార్చుతూ, వైజాగ్‌లో ‘ఏక్ రాగ’ను ఆవిష్కరించిన ఇంద్రియ, ఆదిత్య బిర్లా జ్యువెలరీ* భారతదేశ ప్రాంతీయ కళాసంపద…
Watch Now
Aug 1, 2026
మన నేస్తరికం భూమాతతో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం ఇంటెలి విద్యార్థుల
మన నేస్తరికం భూమాతతో అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విశాఖ జిల్లా ఆనందపురం మ…
Watch Now