--:-- | Today 28°C · Weather
Breaking

మన నేస్తరికం భూమాతతో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం ఇంటెలి విద్యార్థుల

Aug 1, 2026 9:08 2 views 1

Description

మన నేస్తరికం భూమాతతో అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని గొట్టిపల్లి పంచాయతీ వెంకటాపురం గ్రామం వద్ద మారికవలస చెందిన ఇంటెలి విద్యార్థుల చేత వరి నాట్లు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి పుట్టి రెండు లక్షల సంవత్సరాల అయిందని, అప్పటినుండి మనుషులు ఆయురారోగ్యాలతో జీవించడానికి ఉపకరిస్తున్న భూమాత పరిరక్షణ, ప్రకృతి వనరుల పరిరక్షణ, సమస్త జీవావరణ పరిరక్షణ మానవాళి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. అందుకే మన నేస్తరకం భూమాత తో అని తెలియజేశారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలని కోరారు. ప్రకృతి వనరుల పరిరక్షణ మానవాళి బాధ్యత అని అన్నారు. రసాయన ఎరువులు, రసాయన గడ్డి తీత మందులు, రసాయన క్రిమి సంహారకాలతో భూమాతను విషతుల్యం చేయవద్దు అని వేడుకున్నారు. ఇవన్నీ మన తాగే నీటిని, గాలినీ, ఆహార పదార్థాలను విషమయం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి తాము భుజించే ఆహారం ఎలాంటిది, దానిని ఎలా ఉత్పత్తి చేశారు అనే విషయాలను తెలుసుకుని భుజించాలని కోరారు. ప్యాకెట్ ఫుడ్, జంక్ ఫుడ్ వద్దే వద్దని, వాటి వల్ల కలిగే అనారోగ్యాలను తెలుసుకొని వాటికి దూరంగా జీవించాలని కోరారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులను ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలని కోరాలని వివరించారు. నిల్వ ఉండడానికి తయారు చేసే పదార్థాలు ప్యాకెట్ లో పెట్టినప్పుడు అవి నిల్వ ఉండటానికి వాడే రసాయనాలు ఆరోగ్యకరమైనవి కావని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో "ద ఇంటెల్లి స్కూల్" ఉపాధ్యాయులు నాగమణి, సత్యవతి, సంధ్యారాణి, అపర్ణ , ఛాయాచిత్రకారుడు సంతోష్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో సమన్వయకర్త జె రాజేశ్వరి, యాక్షన్ ఎయిడ్ ఎన్జీవో ప్రతినిధి ఐ కృష్ణ కుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు. వందమంది విద్యార్థులు నాట్లు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Videos

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్
Jul 31, 2026

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్

శుక్రవారం విశాఖలో నిర్వహించిన డిమాండ్స్ డే కార్యక్రమం పూర్తిగా విజయవంతమైంది.. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధిక…

Watch Now