--:-- | Today 28°C · Weather
Breaking

మేహద్రిగడ్డలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల తరలింపును వ్యతిరేకిస్తూ

Jul 30, 2026 5:09 49 views 2

Description

మేహద్రిగడ్డలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల తరలింపును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎల్ఐసి కూడలి లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ధర్నాలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేహాద్రిగడ్డలోని గురుకుల పాఠశాల యధావిధిగా కొనసాగించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. జేఈఈ, నీట్ కోచింగ్ ఇచ్చేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని.. అయితే ఆ సాకుతో గురుకుల విద్యార్థులను వేరేచోటకు తరలించడం సరికాదని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్, అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా అధికార ప్రతినిధి రావాడ ప్రకాష్, జెల్లీ రాజశేఖర్ లు అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా గురుకుల పాఠశాల విద్యార్థులను తరలించడం అన్యాయమని అన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు నిర్వహించేందుకు కొత్త భవనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు.ఇక్కడ విద్యార్థులను వేరే గురుకులాలకు తరలించడం వల్ల పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వేరే గురుకులాలకు తరలించిన పిల్లలను తిరిగి తీసుకురావాలని కోరారు.వెంటనే గురుకుల పాఠశాల విద్యార్థుల తరలింపును వెనక్కి తీసుకొని మేహాద్రి గడ్డలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నిరసనలో వివిధ దళిత సంఘాల ప్రతినిధులు సుధాకర్, అప్పారావు, బోగేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Videos

గురు పౌర్ణమి వేళ మహా అన్నదానం.. 'హనుమాన్ యంగ్ స్టార్స్' ఆధ్వర్యంలో 2,000 మందికి ప్రసాద వితరణ..*
Jul 30, 2026

గురు పౌర్ణమి వేళ మహా అన్నదానం.. 'హనుమాన్ యంగ్ స్టార్స్' ఆధ్వర్యంలో 2,000 మందికి ప్రసాద వితరణ..*

*గురు పౌర్ణమి వేళ మహా అన్నదానం.. 'హనుమాన్ యంగ్ స్టార్స్' ఆధ్వర్యంలో 2,000 మందికి ప్రసాద వితరణ..* విశాఖ అమర్ నగర్, సిబిఎం కాంపౌండ్‌లోని శ్రీ …

Watch Now