--:-- | Today 28°C · Weather
Breaking

గురు పౌర్ణమి వేళ మహా అన్నదానం.. 'హనుమాన్ యంగ్ స్టార్స్' ఆధ్వర్యంలో 2,000 మందికి ప్రసాద వితరణ..*

Jul 30, 2026 2:40 127 views 7

Description

*గురు పౌర్ణమి వేళ మహా అన్నదానం.. 'హనుమాన్ యంగ్ స్టార్స్' ఆధ్వర్యంలో 2,000 మందికి ప్రసాద వితరణ..*

విశాఖ అమర్ నగర్, సిబిఎం కాంపౌండ్‌లోని శ్రీ ఉమామహేశ్వర విజయ గణపతి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ యంగ్ స్టార్స్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 2,000 మంది భక్తులకు, స్థానికులకు ఆలయ నిర్వాహకులు భోజన ప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయ శర్మ మాట్లాడుతూ.. దైవ సేవతో పాటు మానవ సేవలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. హనుమాన్ యంగ్ స్టార్స్ సభ్యులు కేవలం విశేష పర్వదినాల్లోనే కాకుండా, ప్రతి గురువారం క్రమం తప్పకుండా 300 మందికి పైగా అన్నదానం చేస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారని కొనియాడారు. ఈరోజు స్వామివారికి పంచామృతాభిషేకం, పాలాభిషేకం, అన్నాభిషేకాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం సాయంత్రం వేళ కోలాటం మరియు స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. భక్తిభావంతో పాటు సామాజిక బాధ్యతగా ఈ సేవలను కొనసాగిస్తున్న యువతను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యంగ్ స్టార్స్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related Videos

మేహద్రిగడ్డలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల తరలింపును వ్యతిరేకిస్తూ
Jul 30, 2026

మేహద్రిగడ్డలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల తరలింపును వ్యతిరేకిస్తూ

మేహద్రిగడ్డలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల తరలింపును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం…

Watch Now