--:-- | Today 28°C · Weather
Breaking

J & T జెమ్ మరియు జ్యువెలరీ షోరూమ్ ప్రారంభం

Oct 10, 2026 6:40 5 views 2

Description

విశాఖపట్నం 9 అక్టోబర్ 26 : ఒడిశాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ J & T జెమ్ మరియు జ్యువెలరీ సంస్థ వారూ విశాఖపట్నం వాల్తేరు అప్‌లాండ్స్ రోడ్డులోని సంపత్ వినాయక గుడికి సమీపంలో తమ 7వ J & T జెమ్ మరియు జ్యువెలరీ షోరూమ్‌ను నేడు వైభవంగా ప్రారంభించారు. సినీ నటి నిధి అగర్వాల్ ల్యాండ్‌మార్క్ బిల్డింగ్‌లోని J & T జెమ్ మరియు జ్యువెలరీ నూతన షోరూమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ హాజరయ్యారు.
J & T జెమ్ మరియు జ్యువెలరీకి భువనేశ్వర్‌లో మూడు షోరూమ్స్ మరియు బెర్హంపూర్, బాలాసోర్, అంగుల్‌లలో ఒక్కొకో షోరూమ్ ఉన్నాయి. విశాఖపట్నంలో ప్రారంభమైన ఈ షోరూమ్ సంస్థకు ఏడవది త్వరలో గువాహటిలో తమ ఎనిమిదవ షోరూమ్‌ను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సురేష్ కుమార్ చౌదరి, డైరెక్టర్ శ్రీమతి మధుశ్రీ చౌదరి మాట్లాడుతూ, J & T జెమ్ మరియు జ్యువెలరీ ఒడిశాలో ప్రముఖ ఆభరణాల సంస్థగా గుర్తింపు పొందినదని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, భవిష్యత్తులో రాష్ట్రంలోని పలు నగరాలలో మరిన్ని షోరూమ్‌లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నట్లు ప్రకటించారు. నాణ్యత, ఆకర్షణీయమైన డిజైన్ల విషయంలో తమ సంస్థ ఎల్లప్పుడూ ఉన్నత ప్రమాణాలను పాటిస్తుందని వారు పేర్కొన్నారు. విశాఖపట్నం నగరానికి ఉన్న విశాల దృక్పథం, విభిన్న సంస్కృతుల సమ్మేళనం, వ్యాపారాభివృద్ధికి ఉన్న అపార అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ షోరూమ్‌ను ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు.
షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ప్రారంభోత్సవ ఆఫర్లను సంస్థ ప్రకటించింది. బంగారు ఆభరణాలపై 5.99 శాతం మాత్రమే తరుగు ఉంటుంది, మేకింగ్ ఛార్జీలు పూర్తిగా ఉచితం. వెండి ఆభరణాలపై మేకింగ్ ఛార్జీలు 0 శాతంగా ఉంటాయి. వజ్రాభరణాలపై వాటి విలువలో 25 శాతం వరకు ప్రత్యేక తగ్గింపును అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

Related Videos

విశాఖలో దోపిడీ ముఠాపై పోలీసుల ఉక్కుపాదం.. ముగ్గురు నిందితులు అరెస్ట్ ll VVW news
Oct 10, 2026

విశాఖలో దోపిడీ ముఠాపై పోలీసుల ఉక్కుపాదం.. ముగ్గురు నిందితులు అరెస్ట్ ll VVW news

విశాఖలో దోపిడీ ముఠాపై పోలీసుల ఉక్కుపాదం.. ముగ్గురు నిందితులు అరెస్ట్ 2\. శ్రీకాకుళం సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గొండు …

Watch Now
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం పార్టీ పరమైన రిజర్వేషన్లు: ఎమ్మెల్యే గణబాబు ll VVW news
Oct 10, 2026

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం పార్టీ పరమైన రిజర్వేషన్లు: ఎమ్మెల్యే గణబాబు ll VVW news

విశాఖలో దోపిడీ ముఠాపై పోలీసుల ఉక్కుపాదం.. ముగ్గురు నిందితులు అరెస్ట్ 2\. శ్రీకాకుళం సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గొండు …

Watch Now
దక్షిణ నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా రూ.3.68 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం*
Oct 10, 2026

దక్షిణ నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా రూ.3.68 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం*

*దక్షిణ నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా రూ.3.68 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం* **నిరంతరం అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో…

Watch Now