--:-- | Today 28°C · Weather
Breaking

18న వర్కింగ్ జర్నలిస్టుల దసరా సంబరాలు*

Sep 29, 2026 3:39 4 views 1

Description

*

,*ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడే సందడి*

*సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట*

*జర్నలిస్టుల కుటుంబాలకు చీరలు*.. *సభ్యులకు స్వీట్లు.. పిల్లలకు ప్రత్యేక బహుమతులు*

*జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల*

అక్కయ్యపాలెం జంక్షన్..
విశాఖపట్నం, సెప్టెంబర్ 29:

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్‌కాస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో ఈ నెల 18న వర్కింగ్ జర్నలిస్టుల దసరా సంబరాలను
నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పి. నారాయణ లు తెలిపారు.

మంగళవారం అక్కయ్యపాలెం జంక్షన్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో దసరా సంబరాల ఏర్పాట్లతో పాటు జర్నలిస్టు పెండింగ్ సమస్యలకు సంబంధించిన పలు అంశాలపై కార్యవర్గ సభ్యులు చర్చించారు.

ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు, పి. నారాయణ మాట్లాడుతూ 18న ఉదయం 9 గంటలకు అల్పాహారంతో దసరా సంబరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అనంతరం అమ్మవార్ల వేషధారణ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంటుందన్నారు. జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు చీరలు, సభ్యులందరికీ స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు పిల్లలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తామని తెలిపారు. అనంతరం కమ్మని విందు భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా వేడుకల్లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వీరు కోరారు.

ఈ సమావేశంలో ఫెడరేషన్ ప్రధానకార్యదర్శి జి. శ్రీనివాస్,ఆర్గనైజర్ సెక్రటరీ డి రవికుమార్,ఉపాధ్యక్షులు ఎన్ రామకృష్ణ, విశాఖ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు వై..రామకృష్ణ,నగేష్, ఆనంద్, వేణు, నాగేశ్వరావు, ప్రసాద్, అప్పలనాయుడు, రాజశేఖర్ బ్రాడ్ కాస్ట్అధ్యక్ష..కార్యదర్శిలు ఈశ్వర్ రావు..మదన్,జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్, శేషు, నరసింగరావు,నాయుడు, నెలరాజు. గోపినాధ్,స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి జగన్మోహన్, శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ శర్మ,హరి,రాజశేఖర్,రవి కుమార్,

Related Videos

శ్రీకాకుళం రూరల్ మండలం తండ్యాంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం )లో పది నెలల కఠినమైన శిక్షణను
Sep 29, 2026

శ్రీకాకుళం రూరల్ మండలం తండ్యాంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం )లో పది నెలల కఠినమైన శిక్షణను

శ్రీకాకుళం రూరల్ మండలం తండ్యాంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డీపీటీసీ)లో పది నెలల కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజాసే…

Watch Now
స్వర్ణ సచివాలయ ఉద్యోగుల నిరసన ...సమస్యలపై శాంతియుత పోరాటం l
Sep 29, 2026

స్వర్ణ సచివాలయ ఉద్యోగుల నిరసన ...సమస్యలపై శాంతియుత పోరాటం l

సచివాలయ ఉద్యోగుల శాంతియుత నిరసన సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల ఆందోళన సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి స్వర్ణ సచివాలయ ఉద్యోగుల నిరసన స…

Watch Now
,ఫిషింగ్ హర్బార్ ఫోర్త్ స్టార్ బాయ్స్ ఆధ్వర్యంలో  4వ నంబర్ జెట్టి దగ్గర, వినాయక చవితి మహోత్సవాలు
Sep 29, 2026

,ఫిషింగ్ హర్బార్ ఫోర్త్ స్టార్ బాయ్స్ ఆధ్వర్యంలో 4వ నంబర్ జెట్టి దగ్గర, వినాయక చవితి మహోత్సవాలు

విశాఖ,ఫిషింగ్ హర్బార్ ఫోర్త్ స్టార్ బాయ్స్ ఆధ్వర్యంలో 4వ నంబర్ జెట్టి దగ్గర, వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అజయ్, దాసు మాట్లాడుతూ ఇద…

Watch Now