--:-- | Today 28°C · Weather
Breaking

శ్రీకాకుళం రూరల్ మండలం తండ్యాంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం )లో పది నెలల కఠినమైన శిక్షణను

Sep 29, 2026 6:50 2 views 1

Description

శ్రీకాకుళం రూరల్ మండలం తండ్యాంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డీపీటీసీ)లో పది నెలల కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజాసేవలోకి అడుగుపెడుతున్న కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 142 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని మార్చ్‌పాస్ట్ గౌరవ వందనం స్వీకరించడం జరిగింది. విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావం, నిజాయితీ మరియు క్రమశిక్షణను పాటిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా కొత్తగా విధుల్లోకి చేరుతున్న పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చాను. ప్రజల సమస్యలను ఓపికగా విని, చట్ట పరిధిలో వాటికి సరైన పరిష్కారం చూపుతూ పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించాను.

రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి శాంతిభద్రతలే మూలాధారం. శాంతియుత వాతావరణం నెలకొన్నప్పుడే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తరలివచ్చి మన యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక న్యాయపరమైన చిక్కులను అధిగమించి, కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే 1,000 మందికి పైగా మహిళలతో కలిపి మొత్తం 5,800 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ప్రస్తుత బ్యాచ్ శిక్షణ పూర్తికాకముందే మరో 1,156 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాం. ఇకపై కూడా ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిరుద్యోగ యువత కోసం పోలీసు నియామకాలు చేపడతామని స్పష్టం చేశాను.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ నేరాల నియంత్రణ, వేగవంతమైన సేవలందించడంపై సిబ్బంది దృష్టి సారించాలి. ముఖ్యంగా మహిళా భద్రత, మాదకద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలన, రహదారి భద్రత వంటి అంశాల్లో పోలీసులు మరింత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఇటీవలి తుఫాన్ల సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల తరలింపు, సహాయక చర్యల్లో పోలీసు శాఖ అందించిన రెస్క్యూ సేవలు అభినందనీయం. కవాతులోనూ, శిక్షణలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు, వారిని తీర్చిదిద్దిన శిక్షణ సిబ్బందికి ప్రశంసా పత్రాలు, ట్రోఫీలను అందజేసి, తమ పిల్లలను ప్రజాసేవకు అంకితం చేసిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశాను.

Related Videos

స్వర్ణ సచివాలయ ఉద్యోగుల నిరసన ...సమస్యలపై శాంతియుత పోరాటం l
Sep 29, 2026

స్వర్ణ సచివాలయ ఉద్యోగుల నిరసన ...సమస్యలపై శాంతియుత పోరాటం l

సచివాలయ ఉద్యోగుల శాంతియుత నిరసన సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల ఆందోళన సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి స్వర్ణ సచివాలయ ఉద్యోగుల నిరసన స…

Watch Now
,ఫిషింగ్ హర్బార్ ఫోర్త్ స్టార్ బాయ్స్ ఆధ్వర్యంలో  4వ నంబర్ జెట్టి దగ్గర, వినాయక చవితి మహోత్సవాలు
Sep 29, 2026

,ఫిషింగ్ హర్బార్ ఫోర్త్ స్టార్ బాయ్స్ ఆధ్వర్యంలో 4వ నంబర్ జెట్టి దగ్గర, వినాయక చవితి మహోత్సవాలు

విశాఖ,ఫిషింగ్ హర్బార్ ఫోర్త్ స్టార్ బాయ్స్ ఆధ్వర్యంలో 4వ నంబర్ జెట్టి దగ్గర, వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అజయ్, దాసు మాట్లాడుతూ ఇద…

Watch Now