--:-- | Today 28°C · Weather
Breaking

సంతాన సంరక్షణ వ్యవస్థను బలోపేతం కొరకు ఒయాసిస్ అకాడమీని ఏర్పాటు ఒయాసిస్ ఫెర్టిలిటీ వెల్లడి

Jul 23, 2026 8:38 5 views 1

Description

జనని డైలాగ్స్‌ సదస్సులో సంతాన సంరక్షణ వ్యవస్థను బలోపేతం కొరకు
ఒయాసిస్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు ఒయాసిస్ ఫెర్టిలిటీ వెల్లడి

విశాఖపట్నం 23 జూలై 2026: 2009లో స్థాపించబడిన, ఒయాసిస్ ఫెర్టిలిటీ భారతదేశం అంతటా 40 కి పైగా కేంద్రాలను కలిగి సైన్స్ నేతృత్వంలో పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ, నైతిక సంరక్షణ మరియు రోగి శ్రేయస్సుకు కట్టుబడి పనిచేస్తుంది. ఒయాసిస్ ఫెర్టిలిటీ దేశవ్యాప్తంగా పునరుత్పత్తి ఆరోగ్యాన్ని బలోపేతం చేసే ప్రజా అవగాహన, విద్య మరియు శిక్షణలో పెట్టుబడి పెడుతుంది.సంతానోత్పత్తి ఆరోగ్యం,ముందస్తు అవగాహన కల్పించుటకు ఒయాసిస్ ఫెర్టిలిటి “ జననీ డైలాగ్స్” పేరిట తొలి సదస్సును ఈరోజు విశాఖపట్నంలో నిర్వ హించినది. ఈ సదస్సు నందు ప్రజారోగ్యం, ప్రభుత్వ సంస్థలు, సైకాలాజీ, శిశు సంక్షేమం, మానవ వనరులు శాఖలు, సంతానోత్పత్తి వైద్య వంటి రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

దేశం యొక్క మొత్తం సంతానోత్పత్తి రేటు (టిఎఫ్ఆర్) ఇప్పటికే జనాభా భర్తీ స్థాయి కంటే తక్కువగా ఉండటం ఆందోళనకరమనిపలువురు వక్తలు ఈ సదస్సులో వక్కాణించారు.ఇందుకు ఆలస్యంగా జరుగుతున్న వివాహాల కంటే, విద్య, వృత్తి, ఆర్థిక భద్రత మరియు వ్యక్తిగత ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ దంపతులు ఉద్దేశపూర్వకంగా సంతానోత్పత్తిని వాయిదా వేస్తున్నట్లు వక్తలు అభిప్రాయపడ్డారు. పేరెంట్‌హుడ్ పారడాక్స్ (తల్లిదండ్రులు కావాలనే ఆకాంక్ష–వాస్తవాల మధ్య వైరుధ్యం) - ఈ చర్చలో ఒక ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. తల్లిదండ్రులు కావడానికి అయ్యే ఆర్థిక వ్యయం గురించి ఈ చర్చా వేదికలో విస్తృతంగా చర్చించారు. సంతానాన్ని పెంచేందుకు అయ్యే ఖర్చు, ఆర్థిక ప్రణాళిక, ప్రభుత్వ సహాయక విధానాలను వ్యక్తిగత భారంగా కాకుండా, కుటుంబ నిర్మాణానికి అవసరమైన కీలక తోడ్పాటుగా పరిగణించాలని వక్తలు అభిప్రాయపడ్డారు.

ఈ సదస్సు సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాపకురాలు , మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి. రావు మాట్లాడుతూ "భారతదేశంలో కుటుంబ నిర్మాణం కోసం ప్రణాళిక చేసుకోవడం క్రమంగా కష్టతరం అవుతోంది. దీనికి ప్రజల్లో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆసక్తి తగ్గిపోవడం కారణం కాదు. సంతానోత్పత్తికి సంబంధించిన కాలపరిమితి, పిల్లల పెంపకానికి అయ్యే ఆర్థిక వ్యయం, ఆధునిక ఉద్యోగ జీవితంలోని ఒత్తిళ్లు పరస్పరం భిన్న దిశల్లో ప్రభావం చూపుతుండటమే ప్రధాన కారణమని కుటుంబ నిర్మాణానికి సంబంధించి కుటుంబాలు ఒంటరిగా ముందుకు సాగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం, ఆరోగ్యరంగ నిపుణులు, ఉద్యోగదాతలు, మనస్తత్వవేత్తలు, సమాజంలోని వివిధ వర్గాలను ఒకే వేదికపైకి 'జనని డైలాగ్స్‌' తీసుకువచ్చింది" అన్నారు. భారతదేశంలో పునరుత్పత్తి వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి అంకితమైన తమ విద్యా మరియు శిక్షణా కార్యక్రమమైన 'ఓయాసిస్ అకాడమీ'ని కూడా ప్రారంభిస్తున్నట్లు ఓయాసిస్ ఫెర్టిలిటీ ప్రకటించింది. ఈ అకాడమీ ప్రధానంగా మూడు రంగాలలో పనిచేస్తుంది. అవి పరిశోధన, ఆవిష్కరణ, మౌలిక శాస్త్రీయ సహకారాన్ని పెంపొందించుటకు అకాడమీ ఒక వేదికగా పనిచేస్తుంది. ముఖ్యంగా టైర్ II మరియు టైర్ III ప్రాంతాలలో తమ ప్రత్యేక శిక్షణను గణనీయంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ రీజినల్ మెడికల్ హెడ్ డాక్టర్ రాధిక పొట్లూరి మాట్లాడుతూ, "ప్రారంభ దశలోనే సంతాన సాఫల్యంపై అవగాహన పెంచుకోవడం, అలాగే సరైన పద్ధతిలో ప్రత్యుత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో 'ది పేరెంట్‌హుడ్ పారడాక్స్' స్పష్టం చేస్తోంది అన్నారు. ఇంకనూ జంటలకు నాణ్యమైన వైద్య సేవలు అందించటమంటే ప్రత్యేక శిక్షణ మరియు వైద్య సేవలలో అత్యుత్తమ ప్రమాణాలను సాధించడంపై నిరంతరం పెట్టుబడి పెట్టడమే అన్నారు. ఒయాసిస్ అకాడమీ వంటి కార్యక్రమాల ద్వారా, ఈ ప్రాంతంలోని కుటుంబాలకు మెరుగైన పునరుత్పత్తి ఆరోగ్య ఫలితాలను అందించడంతో పాటు, ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేయగలమని మేము ఆశిస్తున్నాము"అని అన్నారు.

Related Videos