--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ స్టీల్ ప్లాంట్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై

Jul 22, 2026 5:40 0 views 0

Description

*టీఎన్టీయూసీ*

విశాఖ స్టీల్ ప్లాంట్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్న స్టీల్ సిఐటియు నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని టీ ఎన్ టి యు సి నేతలు అన్నారు.ఉక్కునగరంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ 2014లో ఉక్కు నిర్వాసితులకు డిప్లొమాపై నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వారికి అన్యాయం జరగకూడదు అని ఐటిఐతో పాత పద్ధతిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగ అవకాశాలు రెండు సార్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుంది అని అన్నారు.ఉక్కు నిర్వాసితులకు కాంట్రాక్టు పనులలో స్కిల్డ్ సెమిస్కిల్డ్ కూడా కల్పించడం జరిగిందని,హుదూద్ లో కేవలం 24 గంటలో పవర్ ఇచ్చి కాపాడిన ఘనత టిడిపి ప్రభుత్వానిదని అన్నారు.గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. పైగా విశాఖ ఉక్కును నిర్వీర్యం చేస్తున్నప్పుడు సిఐటియు నేతలు కనీసం మాట్లాడకుండా వారికి మద్దతు పలుకుతూ ఉద్యమాన్ని నీరుగార్చి ఉద్యమాలు చేస్తున్నట్టు నటించి నిర్వాసితులని కనీసం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీలో ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా ఈరోజు నిర్వాసితులకు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడం సమంజసం కాదని అన్నారు.రాష్ట్ర మినిమం వేజ్ బోర్డు డైరెక్టర్ విళ్ల రామ్మోహన్ కుమార్, స్టీల్ టి ఎన్ టి యు సి ప్రధానకార్యదర్శి నమ్మి సింహాద్రి, అధ్యక్షులు గుమ్మడి నరేంద్రకుమార్,గుంజా చింతయ్య పల్లా పెంటారావు సిరపనశెట్టి రవికుమార్ గాజువాక నియోజకవర్గ టి ఎన్ టి యు సి ప్రధానకార్యదర్శి కోన సోమినాయుడు నాగుబిల్లి లక్ష్మణ్ గంప కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు

Related Videos