పార్టీ కోసం మల్లేశ్వరి సేవలు చిరస్మరణీయం: కే.కే. రాజు ఘనంగా జన్మదిన వేడుకలు..
Description
పార్టీ కోసం మల్లేశ్వరి సేవలు చిరస్మరణీయం: కే.కే. రాజు
ఘనంగా జన్మదిన వేడుకలు..
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్
విశాఖపట్నం, జూలై 25 (ఆంధ్రప్రభ):
పార్టీ కష్టకాలంలోనూ వెనుకడుగు వేయకుండా తన గళం ద్వారా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ అంకితభావంతో పనిచేసిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా మల్లేశ్వరి సేవలను పార్టీ ఎన్నటికీ మరువదని వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షుడు కే.కే. రాజు అన్నారు. సీతమ్మధారలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన మంచా మల్లేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షుడు కే.కే. రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, నాయకులు మొల్లి అప్పారావు, గాజువాక ఇన్‌ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ముఖ్య అతిథులుగా హాజరై మల్లేశ్వరిచేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
మంచా మల్లేశ్వరి మాట్లాడుతూ, తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తుతానని, పార్టీ బలోపేతం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. ప్రతి కార్యకర్త తన కుటుంబ సభ్యుడేనని, అందరి సహకారంతో పార్టీ విజయానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రవిరెడ్డి, పద్మావతి, శ్రీదేవి వర్మ, వంకాయల మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related Videos
Jul 26, 2026
The New Brezza Grand Launch in Jayabheri Maruti, Vizag| Veerumama's Brand.

Watch Now
Jul 25, 2026
డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి #vvwnews #news #ysrcptrolls
ఏపీలో డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైయస్ఆర్‌సీపీ …
Watch Now