--:-- | Today 28°C · Weather
Breaking

మెడికవర్ హాస్పిటల్స్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ week వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ll VVW news

Aug 5, 2026 7:52 18 views 1

Description

మెడికవర్ హాస్పిటల్స్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలు ఘనంగా నిర్వహణ

Vizag, ఆగస్ట్ 5, 2026: ప్రతి సంవత్సరం ఆగస్ట్ మొదటి వారం ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వారంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా మెడికవర్ హాస్పిటల్స్‌ లో ఆగస్ట్ 1 నుండి 7వ తేదీ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ వారోత్సవాల్లో తల్లిపాలలోని పోషక విలువలు, శిశువు ఆరోగ్య అభివృద్ధిపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించే అనేక కార్యక్రమాలు నిర్వహించారు. నర్సులు, రెసిడెంట్ డాక్టర్ల కోసం క్విజ్ పోటీలు, పోస్టర్ ప్రదర్శనలు, విద్యా కార్యక్రమాలు, బ్రెస్ట్ ఫీడింగ్ సమస్యలపై మినీ వర్క్‌షాపులు నిర్వహించబడ్డాయి.

డా. సాయి సునీల్ కిషోర్, డా. విజయ్, డా. మౌనికా, డా. ప్రియాంక , సెంటర్ హెడ్ డా. శ్రీకాంత్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి తమ ప్రసంగాలతో తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. డా. సాయి సునీల్ కిషోర్ నియోనాటాలజిస్టు & పీడియాట్రిక్ స్పెషలిస్టు మాట్లాడుతూ, "తల్లిపాలు శిశువుకు మొదటి టీకా లాంటివి. శిశువు ఆరోగ్యానికి, రోగనిరోధకశక్తి పెరుగుదలకు ఇవి మేలైన ఆధారం. ప్రతి తల్లి వీటిని ఇచ్చేందుకు చురుకుగా ఉండాలి" అని అన్నారు. డా. ప్రియాంక మాట్లాడుతూ,"తల్లిపాలు తల్లికి, బిడ్డకు శారీరకంగా, మానసికంగా లాభం కలిగిస్తాయి. ఈ ప్రక్రియ ఒక సహజమైన బంధాన్ని ఏర్పరచుతుంది. ప్రతి తల్లి దీన్ని ప్రోత్సహించాలి" అని అన్నారు.

మెడికవర్ హాస్పిటల్స్ ఈ కార్యక్రమం ద్వారా తల్లుల్లో ఆత్మవిశ్వాసం, అవగాహన పెంచే దిశగా మరొక ముందడుగు వేసింది. వైద్యులు, నర్సింగ్ తల్లులు మరియు ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

Related Videos

ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోందని ll
Aug 5, 2026

ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోందని ll

ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువత ముఖంలోన…

Watch Now
కేవలం మెడల్స్ గెలవడం మాత్రమే కాదు.. ఆమె తన ప్రస్థానాన్ని ఎలా వ్యవస్థీకృతం చేశారో..
Aug 5, 2026

కేవలం మెడల్స్ గెలవడం మాత్రమే కాదు.. ఆమె తన ప్రస్థానాన్ని ఎలా వ్యవస్థీకృతం చేశారో..

కేవలం మెడల్స్ గెలవడం మాత్రమే కాదు.. ఆమె తన ప్రస్థానాన్ని ఎలా వ్యవస్థీకృతం చేశారో.. ఆంధ్రప్రదేశ్ క్రీడారంగం మీద ఆమె తన ముద్రను ఏవిధంగా విడిచి…

Watch Now
చంద్రబాబు, లోకేష్ గిరిజనలకు క్షమాపణ చెప్పాలి*
Aug 5, 2026

చంద్రబాబు, లోకేష్ గిరిజనలకు క్షమాపణ చెప్పాలి*

*లోకేషుడు.. నాయుడు గారి తాలుక..* *ఇక అంతా మంత్రి ‘లోకేష్‌’యే అన్నీ ఆయన హాయంలోనే..!* *సకల శాఖ మంత్రి విశాఖలో మరో శంకుస్థాపన* *దమ్ముంటే అభివృద…

Watch Now