--:-- | Today 28°C · Weather
Breaking

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సొంత్యాం శాఖ నూతన ప్రాంగణంలో ఘన ప్రారంభం#vvwnews

Jul 9, 2026 2:51 0 views 0

Description

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సొంత్యాం శాఖ నూతన ప్రాంగణంలో ఘన ప్రారంభం

తేదీ 09 జూలై 2026న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సొంత్యాం శాఖను నూతన ప్రాంగణంలో విశాఖపట్నం రీజినల్ మేనేజర్ శ్రీ లావేటి అనంతరావు గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమం బ్రాంచ్ మేనేజర్ శ్రీమతి పైడి స్వప్న ఆధ్వర్యంలో చీఫ్ మేనేజర్లు, శాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు, ఖాతాదారులు మరియు గ్రామస్తుల సమక్షంలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.

ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ శ్రీ లావేటి అనంతరావు గారు, బ్రాంచ్ మేనేజర్ శ్రీమతి పైడి స్వప్న గారు మాట్లాడుతూ, ఖాతాదారుల విశ్వాసం, సహకారం మరియు ప్రజల ఆదరణతో శాఖ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసి, నాణ్యమైన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేఘప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) శ్రీ లక్ష్మీపతి గారు కూడా పాల్గొని, నూతన ప్రాంగణంలో ప్రారంభమైన శాఖ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Related Videos

విశాఖ  35 వార్డ్  లో వైయస్ రాజశేఖర్ రెడ్డి 77 వా జన్మదిన వేడుకలు #vvwnews
Jul 9, 2026

విశాఖ 35 వార్డ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి 77 వా జన్మదిన వేడుకలు #vvwnews

విశాఖ 35 వార్డ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి 77 వా జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ దక్షిణ నియోజకవర్గం మ…

Watch Now