--:-- | Today 28°C · Weather
Breaking

సంస్కృతి పరిరక్షణకు తోడ్పడండి ll VVW news ll Visakha News

Oct 7, 2026 3:39 4 views 1

Description

సంస్కృతి పరిరక్షణకు తోడ్పడండి

బాలలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపు
జాతీయ సాంస్కృతికోత్సవ బాల కళాకారులకు అభినందన
దేశం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నవతరం తోడ్పడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బాలభవన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తున్న జాతీయ బాలల సమైక్యతా సాంస్కృతికోత్సవంలో పాల్గొననున్న విశాఖ జిల్లా బాల కళాకారులను బుధవారం ఆయన అభినందించారు. సంప్రదాయ కళల్లో ఎన్నో గాథలు, పద్ధతులు ఇమిడి ఉన్నాయని, విభిన్న భాషలు, నృత్యాల్లో బాలలు శిక్షణ పొందడం అభినందనీయమన్నారు.

జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జిల్లాకు చెందిన పి. నిత్య ఐశ్వర్య, సిరియాల యామిని, బీజపు గీతిక, కె.హెచ్. ప్రియంత జాతీయ స్థాయి ఉత్సవంలో పాల్గొనడం గర్వకారణమన్నారు. అంతర్జాతీయ జానపద కొరియోగ్రాఫర్‌ ఆర్‌. నాగరాజ్‌ పట్నాయక్‌ రూపొందించిన జానపద, దేశభక్తి నృత్యాలను వారు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆర్‌. నాగరాజ్‌ పట్నాయక్‌ను మాధవ్‌ సత్కరించారు. జి.వి. రామచంద్రరావు, వెంకట్‌ కిర్ల, ఆర్‌. హర్షితా టీనా తదితరులు పాల్గొన్నారు.

Related Videos

సంస్కృతి పరిరక్షణకు తోడ్పడండిబాలలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపుజాతీయ సాంస్కృతి
Oct 7, 2026

సంస్కృతి పరిరక్షణకు తోడ్పడండిబాలలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపుజాతీయ సాంస్కృతి

సంస్కృతి పరిరక్షణకు తోడ్పడండి బాలలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపు జాతీయ సాంస్కృతికోత్సవ బాల కళాకారులకు అభినందన దేశం, సంస…

Watch Now

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం.. బీసీవై పార్టీ
Oct 6, 2026

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం.. బీసీవై పార్టీ

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో వరుణ యాగానికి ఏర్పాట్లు పద్మనాభం మండలంలో వరుణ జపాలు, వరుణ యాగాలు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం.. బీసీవ…

Watch Now
టెక్కలి ఆది ఆంధ్ర వీధి ఎత్తిపోతల పథకం ఎప్పుడు?