--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ స్టీల్ కార్మికులకు సెయిల్ లో చెల్లిస్తున్న బోనస్ ను తక్షణం చెల్లించాలని ll VVw news

Oct 6, 2026 3:50 0 views 0

Description

ప్రచురణార్థం
తేదీ: 6-10-26

తక్షణం బోనస్ చెల్లించాలి

విశాఖ స్టీల్ కార్మికులకు సెయిల్ లో చెల్లిస్తున్న బోనస్ ను తక్షణం చెల్లించాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట"విశాఖ ఉక్కు కార్మికులకు తక్షణం బోనస్ చెల్లించాలని"ప్రధాన డిమాండ్తో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జె అయోధ్యరామ్ మాట్లాడుతూ గడచిన మూడు దశాబ్దాలుగా ఎన్ జె సి ఎస్ ద్వారా స్టీల్ కార్మికులకు బోనస్ ప్రకటించి అది ఇక్కడ అమలు చేసే వారిని కానీ గడచిన రెండు సంవత్సరాలుగా యాజమాన్యం మొండి వైఖరి మరియు గుర్తింపు యూనియన్ అసమర్థత వల్ల ఉక్కు కార్మికులు బోనస్ కోల్పోయారని ఆయన తీవ్రంగా విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్ జె సి ఎస్ లో భాగస్వామ్యమని అక్కడ జరిగిన ఒప్పందాన్ని ఇక్కడ స్టీల్ యాజమాన్యం అమలు చేస్తేనే భాగస్వామ్యం అనే పదానికి అర్థము ఉంటుందని ఆయన వివరించారు. గడచిన రెండు సంవత్సరాలుగా స్టీల్ యాజమాన్యం అనాలోచిత నిర్ణయాల ద్వారా స్టీల్ కార్మికులు అనేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్టీల్ యాజమాన్యం సెయిల్ లో అమలవుతున్న బోనస్ తక్షణం విశాఖ ఉక్కు కార్మికులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ విశాఖ స్టీల్ కు శాశ్వత ఉన్నత యాజమాన్యాన్ని ప్రభుత్వం నియమించడం ద్వారా స్టీల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమ అభివృద్ధి మరియు కార్మికుల భద్రతపై కొంత ఉపశమనం కలుగుతోందని ఆయన అన్నారు. స్టీల్ సిఎండి గారు స్టీల్ కార్మికులు అంకితభావంతో పనిచేస్తున్నారని ఉద్యోగ విరమణ సభలో ఆయన ప్రస్తావించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మరింత ఉత్పత్తి లక్ష్యాలను స్టీల్ పరిశ్రమ అందుకోవాలంటే కార్మికులను ఉత్సాహపరచడం అత్యంత ప్రధానమని ఆయన అన్నారు. స్టీల్ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను స్టీల్ యాజమాన్యం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు టి వి కె రాజు, బి ఎన్ మధుసూదన్, మరిడయ్య, పట్టా రమేష్, బి మహేష్, దేముడు నాయుడు, శ్రీనివాసరెడ్డి, మురళి, మహేష్, అప్పల రెడ్డి, డి ఎస్ ఆర్ సి మూర్తి తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
వి ప్రసాద్
ఉపాధ్యక్షులు

Related Videos

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం.. బీసీవై పార్టీ
Oct 6, 2026

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం.. బీసీవై పార్టీ

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో వరుణ యాగానికి ఏర్పాట్లు పద్మనాభం మండలంలో వరుణ జపాలు, వరుణ యాగాలు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం.. బీసీవ…

Watch Now
టెక్కలి ఆది ఆంధ్ర వీధి ఎత్తిపోతల పథకం ఎప్పుడు?
Oct 6, 2026

టెక్కలి ఆది ఆంధ్ర వీధి ఎత్తిపోతల పథకం ఎప్పుడు?

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో వరుణ యాగానికి ఏర్పాట్లు పద్మనాభం మండలంలో వరుణ జపాలు, వరుణ యాగాలు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం.. బీసీవ…

Watch Now
ఉద్దానం కిడ్నీ సమస్యకు జల్ జీవన్ మిషన్‌తో పరిష్కారం: ఎమ్మెల్యే శిరీష
Oct 6, 2026

ఉద్దానం కిడ్నీ సమస్యకు జల్ జీవన్ మిషన్‌తో పరిష్కారం: ఎమ్మెల్యే శిరీష

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో వరుణ యాగానికి ఏర్పాట్లు పద్మనాభం మండలంలో వరుణ జపాలు, వరుణ యాగాలు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం.. బీసీవ…

Watch Now