--:-- | Today 28°C · Weather
Breaking

అక్రమంగా కాలిన నోట్లు కట్టలు బయట పడ్డ జస్టిస్ యశ్వంత్ వర్మ పై fir నమోదు చేయండి...*.

Jul 11, 2026 7:59 3 views 1

Description

*విదసం ఐక్య వేదిక..@169/2026..*
*9866114338*

*అక్రమంగా కాలిన నోట్లు కట్టలు బయట పడ్డ జస్టిస్ యశ్వంత్ వర్మ పై fir నమోదు చేయండి...*.
*రాష్ట్రపతి, చీఫ్ జస్టిస్ స్పందించండి...*
*విదసం డిమాండ్*
-------
డిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో కాలిని కరెన్సీ కట్టలు పై ఘటన పై కే వీరాస్వామి జడ్జిమెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, సిపి గ్రామ్స్ పిర్యాదు పై రాష్ట్రపతి, చీఫ్ జస్టిస్ తక్షణమే స్పందించాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండు చేసారు..
ఈ రోజు విశాఖ అంబేద్కర్ భవన్ లో జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో వెంకట రావు మాట్లాడుతూ దేశంలో అత్యున్నత రాజ్యాంగ రక్షకులైన రాష్ట్ర పతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి అతి ముఖ్యమైన సంచలన అవినీతి కేసు పై సామాన్యులు పిర్యాదు చేస్తే కింది స్థాయి అధికారులు కనీసం చదవకుండా పిర్యాదు మూసేస్తే ధర్మం నిలుస్తుందా.. అని ప్రశ్నించారు.. గత ఏడాది మార్చి నెలలో డిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన సగం కాలిన అక్రమ నగదు పై విచారణకు ,దర్యాప్తు కు అనేక చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యాయని , సిటింగ్ న్యాయ మూర్తి పై చర్యలు తీసుకోవడానికి ప్రధాన న్యాయమూర్తి అనుమతి అవసరం అని ప్రభుత్వం ఆయన చర్యలు తీసుకోలేదని వెంకట రావు గుర్తు చేశారు.. ఎట్టకేలకు పార్లమెంటు అభిశంసనకు ప్రభుత్వం ఉపక్రమించిన నేపద్యంలో ఏప్రిల్ 9 న యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారన్నారు.. అవినీతి పై దర్యాప్తు నుండి రక్షణ కలిగిన ఉన్నత స్థాయి సిటింగ్ న్యాయ మూర్తి ఆ పదవికి రాజీనామా చేసిన వెంటనే అతడు సాదారణ పౌరుడే నని, అతనిపై దర్యాప్తు కు లేదా fir నమోదు కు సి జె ఐ అనుమతి అవసరం లేదని కే వీరాస్వామి v/s భారత ప్రభుత్వం 1991 తీర్పు స్పష్టం చేసిందన్నారు.. ఈ తీర్పు ప్రకారం మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రెండు నెలల క్రితం రాష్ట్రపతికి , చీఫ్ జస్టిస్ కి విదసం పిర్యాదు చేసిందన్నారు.. సంచలన మైన కేసులో ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలకు ఒక గుర్తింపు కలిగిన సంఘం పిర్యాదు చేస్తే తప్పుడు పద్ధతిలో మా పిర్యాదులు మూసివేశారని వెంకట రావు ఆవేదన వ్యక్తం చేసారు.. యశ్వంత్ వర్మ రాజీనామా చేసిన ఉత్తరం జటపరిచి పిర్యాదు చేస్తే రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయంలో ఉన్న ఐ ఏ ఎస్ అధికారులు గుడ్డిగా సిటింగ్ న్యాయ మూర్తి పై విచారణ కు ప్రధాన న్యాయమూర్తి అనుమతి అవసరం అని మా పిర్యాదు ను తిరస్కరించడం అత్యంత నిర్లక్ష్యం, లేదా నిందితుడితో కుమ్మక్కవడం అని ఆరోపించారు .. దీనిపై రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి స్పందించి మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ పై fir నమోదు చేసేలా ఆదేశించాలని , ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఎసిబి లు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ..
*బస్తాలు బస్తాలు నోట్ల కట్టలు కలిగి ఉన్న మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ పై చర్యలు తీసుకోరా?* *విచారించరా ? సిటింగ్ న్యాయ మూర్తి అంటూ రాజ్యాంగ రక్షణ కల్పిస్తారా? ఇది ధర్మమా?* అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు..
*ముమ్మాటికి తప్పు...*
*రాష్ట్రపతి గారూ, ప్రధాన న్యాయమూర్తి గారూ.. స్పందించండి ... యశ్వంత్ వర్మ పై fir నమోదు కు ఆదేశించండి. అంటూ ఆవేదనతో విదసం విజ్ఞప్తి చేస్తుందన్నారు........*
గుడివాడ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుండి విదసం రాష్ట్ర నాయకులు విశాఖ నుండి గుడివాడ ప్రసాద్, బూ ల భాస్కర రావు, , శ్రీకాకుళం నుండి ఎడ్ల గోపి, అనకాపల్లి నుండి ఫ్రాన్సిస్, మట్ల అప్పారావు, అమలాపురం నుండి గుబ్బల శ్రీనివాసరావు, కాకినాడ నుండి ఉభా చిన్ని
గోడు వెంకటేశ్వర రావు, గుడివాడ భాస్కర రావు , బొకర మోహన్ రావు, కాళ్ల చిన్నా రావు, రేవిడి కృష్ణ, జీ తాత బాబు, సబ్బవర పూ శ్రీనివాసరావు, బి ఉమా మహేశ్వరి, గురుదేవి , పి భాస్కర రావు, తదితరులు పాల్గొన్నారు.

Related Videos

శెట్టిబలిజ సామాజిక భవన నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమo lll
Jul 11, 2026

శెట్టిబలిజ సామాజిక భవన నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమo lll

విశాఖ 34 వ వార్డు పరిధిలో ఉన్న కొబ్బరి తోట , యాత పేట ప్రాంతంలో శెట్టిబలిజ సామాజిక భవన నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమo చేయడం జరిగింది. ద…

Watch Now
నాకు దేశభక్తి లేదు.. దేశమంటే గౌరవం లేదు అని బహిరంగంగా తిరిగే దేశద్రోహులకు
Jul 11, 2026

నాకు దేశభక్తి లేదు.. దేశమంటే గౌరవం లేదు అని బహిరంగంగా తిరిగే దేశద్రోహులకు

నాకు దేశభక్తి లేదు.. దేశమంటే గౌరవం లేదు అని బహిరంగంగా తిరిగే దేశద్రోహులకు ,సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులకు అన్ని రకాలుగా తమ అండదండల్…

Watch Now
కాలుష్య నివారణ, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై జిల్లాలోని మేజర్ పరిశ్రమల నిర్వాహకులు#vvwnews
Jul 11, 2026

కాలుష్య నివారణ, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై జిల్లాలోని మేజర్ పరిశ్రమల నిర్వాహకులు#vvwnews

కాలుష్య నివారణ, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై జిల్లాలోని మేజర్ పరిశ్రమల నిర్వాహకులు, సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో …

Watch Now