--:-- | Today 28°C · Weather
Breaking

సమాజ సేవకుడు పంపాన ఆనందరావు కు జాతీయ స్థాయిలో 2026 విజయదశమి పురస్కారం,ఘన సన్మానం

Oct 14, 2026 1:40 21 views 3

Description

సమాజ సేవకుడు పంపాన ఆనందరావు కు జాతీయ స్థాయిలో 2026 విజయదశమి పురస్కారం,ఘన సన్మానం................ విశాఖపట్నం కు చెందిన సమాజ సేవకుడు పంపాన ఆనందరావు గారికి సామాజిక సేవ,కృషికి, గుర్తింపు గా జాతీయ స్థాయి 2026 విజయదశమి పురస్కారానికి ఎంపికయ్యారు, హైదరాబాద్ లోని చిక్కడపల్లి త్యాగరాజ గాన సభ సంగీత నాట్య కళా వేదిక ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు స్వర్ణకంకణ, మెమంటో,సన్మాన పత్రం,శాలువాతో శ్రీ గౌతమేశ్వర సాహితి కళా సేవా సంస్థ ISO (అంతర్జాతీయ ధృవీకరణ పొందిన సాహితి సామాజిక సేవా సంస్థ) 6వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ పంపాన ఆనందరావు గార్కి,వారు చేస్తున్న సామాజిక సేవలను కొనియాడుతూ,వారు సేవా దాహాన్ని తీర్చే సెలయేరు అని స్వచ్చమైన సేవా దృక్పథం కలవారని పేర్కొన్నారు.గౌరవ అతిరథదులు సమక్షంలో స్వర్ణ కంకణ ధారణ చేసి పురస్కార పత్రం, జ్ఞాపిక, శాలువ తో పాటు ఆత్మీయ ఘన సన్మాన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 40మందికి 2026 జాతీయ పురస్కారాలు అందజేశారు. తనకు చేసిన సన్మాన సత్కారానికి శ్రీ గౌతమేశ్వర సాహితి కళా సేవా సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ దూడపాక శ్రీధర్ గార్కి వారి సహచర సబ్యులకు ఆనందరావు గారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్, సమాజ సేవకుడు పంపాన ఆనందరావు గారికి పలువురు మిత్రులు, శ్రేయయభిలాసులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

Related Videos

విశాఖ అభివృద్ధి పనులపై పీలా గోవింద్ ప్రశంసలు ll VVW news
Oct 14, 2026

విశాఖ అభివృద్ధి పనులపై పీలా గోవింద్ ప్రశంసలు ll VVW news

1\. జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల దౌర్జన్యం తగదు 2\. APPSA అధ్యక్షుడిగా పేడాడ వెంకట ప్రతాప్ ఏకగ్రీవ ఎన్నిక 3\. పోలీసు బలంపై ఆధారపడుతున్నారు: …

Watch Now
కూటమి కొలువుల జాతరతో ఇచ్చిన మాటకు కట్టుబాటు ll VVw news

#vvwnews 2047కు ప్రపంచలోనే భారత్ నెంబర్-1 అవుతుందనడంలో అనుమానం లేదు.
Oct 14, 2026

#vvwnews 2047కు ప్రపంచలోనే భారత్ నెంబర్-1 అవుతుందనడంలో అనుమానం లేదు.

ప్రధాని మోదీ నాయకత్వంలో ఏదైనా సాధ్యమే. దుర్గమ్మ సాక్షిగా గోదావరి-కావేరి నదుల అనుసంధానం జరుగుతుంది. పెన్నా, గోదావరి, కృష్ణా, కావేరి నదులు కలి…

Watch Now
బీసీ రిజర్వేషన్లపై రాజకీయ వేడి**40 శాతం రిజర్వేషన్లతో బీసీలకు భరోసా: టీడీపీ
Oct 13, 2026

బీసీ రిజర్వేషన్లపై రాజకీయ వేడి**40 శాతం రిజర్వేషన్లతో బీసీలకు భరోసా: టీడీపీ

. * **8. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ వేడి** 40 శాతం రిజర్వేషన్లతో బీసీలకు భరోసా: టీడీపీ **9. మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి** …

Watch Now