విశాఖ పోర్ట్ సిటీ రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్.ఎస్.ఎన్.రాజు, కార్యదర్శిగా భాస్కర్ రావు*
Description
*విశాఖ పోర్ట్ సిటీ రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్.ఎస్.ఎన్.రాజు, కార్యదర్శిగా భాస్కర్ రావు*
విశాఖపట్నంలో రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖ పోర్ట్ సిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నగరంలోని ఓ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 2026-27 సంవత్సరానికి గాను క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్.ఎస్.ఎన్. రాజు, సెక్రటరీగా ఐ.భాస్కర్ రావు, ఇతర కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో, 35 వేలకు పైగా క్లబ్‌లతో, 12 లక్షల మంది రోటేరియన్లతో రోటరీ ఇంటర్నేషనల్ విస్తరించి ఉందన్నారు. నూతన కార్యవర్గం నేతృత్వంలో మరిన్ని సేవా శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.ఎస్.ఎన్. రాజు, ఐ.భాస్కర్ రావులు మాట్లాడుతూ.. డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీరామ్ మార్గదర్శకత్వంలో ఈ ఏడాది సరికొత్త సేవా కార్యక్రమాలను ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. రోటేరియన్ల అందరి సహకారంతో సమాజంలో మార్పు తెచ్చేలా ముందుకు సాగుతామని తెలిపారు. అనంతరం పదవి విరమణ చేసిన అధ్యక్ష, కార్యదర్శులు బుద్ధరాజు శివాజీ, భార్గవ్ మహర్షి సేవలను రోటరీ ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ సలహాదారుడు జిఎస్ రాజు, అసిస్టెంట్ గవర్నర్ ఆర్ రామకృష్ణారావు, క్లబ్ సభ్యులు, రోటేరియన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.