--:-- | Today 28°C · Weather
Breaking

భూ ఉపరితలం మీద శీతోష్ణస్థితి చల్లబడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో

Sep 16, 2026 16:39 2 views 1

Description

భూ ఉపరితలం మీద శీతోష్ణస్థితి చల్లబడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని కేథరిన్ విద్య సంస్థలో డైరెక్టర్ డాక్టర్ ఇవేంజిలిన్ రాయ్ అధ్యక్షతన కేథరిన్ సంస్థ, యాక్షన్ ఎయిడ్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవోలు ఓజోన్ డే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత తాటి పళ్ళు నాటిన తర్వాత, భవిష్యత్తులో పశుపక్ష్యాదులకు మేత అవసరమని చిరుధాన్యాలు విద్యా సంస్థ ఆవరణలో చల్లారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో జె.వి రత్నం మాట్లాడుతూ ఓజోన్ పోర పరిరక్షణ మానవాళి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ పరువు పరిరక్షించకపోతే భవిష్యత్తు తనకాలకు మనగుడే ఉండదన్నారు. సమస్త జీవరాశికి నష్టం వాటిల్లుతోందని వివరించారు. అతివృష్టి అనావృష్టి పరిస్థితులు ఏర్పడతాయన్నారు. మానవాళి జీవించేందుకు ఇంకో గోళం లేదు కాబట్టి ఉన్న భూగోళాన్ని కాపాడుకోవాలని ప్రకృతి వనరులను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి ఉన్న చెట్లను కాపాడాలని, కొత్తగా మొక్కలు నాటి పెంచాలని, విస్తారంగా తాటి పళ్ళు నాటి పెంచాలి అని ఆయన కోరారు. ప్రతి విద్యార్ధీ కనీసం ఒక 100 విత్తన బంతులు తయారుచేసి తీర ప్రాంతంలో, కొండల మీద జల్లాలని కోరారు. ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని, హరిత సైనికులుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇవేంజిలిన్ రాయ్ మాట్లాడుతూ తమ విద్యాసంస్థలు నిరంతరంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గ్రీన్ క్లైమేట్ టీం సహాయంతో మరింత విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు
ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ డీన్ డాక్టర్ హెబ్సిబా సింగ్ , యాక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి ఐ కృష్ణ కుమారి, పలువురు విద్యార్థులు మాట్లాడారు. ఓజోన్ డే సందర్భంగా నిర్వహించిన విభిన్న పోటీలలో గెలుపొందిన వారికి జ్ఞాపికలు అందజేశారు .

Related Videos

వీరుమమా ఆధ్వర్యంలో ఘనంగా విజయ సోఫాన పూజ  లడ్డును దక్కించుకున్న చకోర సినిమా నిర్మాత డాక్టర్. హేమారావు
Sep 16, 2026

వీరుమమా ఆధ్వర్యంలో ఘనంగా విజయ సోఫాన పూజ లడ్డును దక్కించుకున్న చకోర సినిమా నిర్మాత డాక్టర్. హేమారావు

వీరుమమా ఆధ్వర్యంలో ఘనంగా విజయ సోఫాన పూజ || లడ్డును దక్కించుకున్న చకోర సినిమా నిర్మాత డాక్టర్. హేమారావు

Watch Now
అత్యంత వేగంగా విజయవంతమైన వందకు పైగా బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ చికిత్సలు
Sep 16, 2026

అత్యంత వేగంగా విజయవంతమైన వందకు పైగా బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ చికిత్సలు

అత్యంత వేగంగా విజయవంతమైన వందకు పైగా బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ చికిత్సలు

Watch Now