--:-- | Today 28°C · Weather
Breaking

కియా ఇండియా 'ఓనర్‌షిప్ సర్వీస్ క్యాంప్ 2026' ప్రారంభం*

Sep 16, 2026 2:12 6 views 2

Description

*కియా ఇండియా 'ఓనర్‌షిప్ సర్వీస్ క్యాంప్ 2026' ప్రారంభం*

*కియా బ్రాండ్ అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన ప్రజాదరణ పొందింది*

*ఈ క్యాంప్ సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 22, 2026 వరకు జరుగుతుంది*

--- *ముఖ్యఅతిథిగా తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ క్యాంప్ ప్రారంభించారు*

మధురవాడ: కియా ఇండియా దేశ వ్యాప్తంగా సరికొత్త 'ఓనర్‌షిప్ సర్వీస్ క్యాంప్ 2026' ను బుధవారం ఉదయం లక్ష్మి కియా షోరూం, మధురవాడ, విశాఖపట్నంలో తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం బి.వి.రామ్ మీడియాతో మాట్లాడుతూ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి కియా బ్రాండ్ అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా కియా సెల్టోస్, కియా సోనెట్, మరియు కియా కేరెన్స్ వంటి మోడళ్లు మన దేశంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. దక్షిణ భారతదేశంలో (ఆంధ్రప్రదేశ్, వైజాగ్ సహా) ఈ క్యాంప్ సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 22, 2026 వరకు జరుగుతుంది.

ఉచితంగా లభించే సేవలు & ఆఫర్లు:
*ఉచిత 36-పాయింట్ వెహికల్ హెల్త్ చెకప్:* మీ కారు యొక్క ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, ఇంజిన్ కంపార్ట్‌మెంట్ మరియు అండర్ బాడీలను పూర్తిగా ఉచితంగా తనిఖీ చేస్తారు. *ఉచిత టాప్ వాష్:* క్యాంప్‌లో పాల్గొనే కార్లకు ఉచితంగా వాషింగ్ సర్వీస్ లభిస్తుంది.
*లేబర్ పై 10% వరకు తగ్గింపు:* సర్వీస్ లేబర్ ఛార్జీలపై 10% డిస్కౌంట్ ఉంటుంది. *కార్ కేర్ సేవలపై 20% డిస్కౌంట్:* కార్ డీటెయిలింగ్ మరియు ఇతర కేర్ సర్వీసులపై భారీ తగ్గింపు. *యాక్సెసరీస్ పై 25% వరకు తగ్గింపు:* సెలెక్టెడ్ కియా జెన్యూన్ యాక్సెసరీస్ కొనుగోలుపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. *రోడ్‌సైడ్ అసిస్టెన్స్:* రిటైల్ RSA ప్లాన్స్‌పై 15% తగ్గింపు లభిస్తుంది.

వైజాగ్‌లోని కియా కార్ల యజమానులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో డి.నారాయణ రాజు, జనరల్ మేనేజర్, కే.వరప్రసాద్ సర్వీస్ మేనేజర్, డాక్టర్ పప్పూర్ నికుంజ, లక్ష్మీ కియా టీం సిబ్బంది, కియా కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Videos

అత్యంత వేగంగా విజయవంతమైన వందకు పైగా బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ చికిత్సలు
Sep 16, 2026

అత్యంత వేగంగా విజయవంతమైన వందకు పైగా బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ చికిత్సలు

అత్యంత వేగంగా విజయవంతమైన వందకు పైగా బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ చికిత్సలు

Watch Now
స్థానికసంస్థలఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలి అమర్‌నాథ్‌ చెల్లని రూపాయి అనకాపల్లి ఎం.పీ సీఎం రమేష్‌
Sep 16, 2026

స్థానికసంస్థలఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలి అమర్‌నాథ్‌ చెల్లని రూపాయి అనకాపల్లి ఎం.పీ సీఎం రమేష్‌

*స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలి.. గుడివాడ అమర్‌నాథ్‌ చెల్లని రూపాయి లాంటివారు.. గాజువాకలో చెల్లని రూపాయి చోడవరంలో చెల్లుతు…

Watch Now
ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడుతుంటే అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోవడంలేదు
Sep 15, 2026

ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడుతుంటే అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోవడంలేదు

ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడుతుంటే అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోవడంలేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. జీవీఎంసీ 2…

Watch Now