--:-- | Today 28°C · Weather
Breaking

సంధ్యా మెరైన్స్ వైజాగ్ మారథాన్ ll VVw news

Oct 29, 2026 11:18 16 views 4

Description

సంధ్యా మెరైన్స్ వైజాగ్ మారథాన్
విశాఖపట్నం 29 అక్టోబర్ 2026: వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంధ్యా మెరైన్స్ వైజాగ్ మారథాన్ 5వ ఎడిషన్ కు సంబంధించిన టీ-షర్ట్, పతకాలను (మెడల్స్) ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీ శంఖబ్రత బాగ్చి విచ్చేశారు. ఆరోగ్యం, ఐక్యత, సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఫిట్‌నెస్‌ ప్రియులు, మారథాన్‌ అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైజాగ్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ కంచేటి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల రహిత, పర్యావరణహిత విశాఖపట్నాన్ని నిర్మించడమే ఈ మారథాన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఎడిషన్‌లో ఎంపిక చేసిన టీ-షర్ట్ రంగులు పంచభూతాల స్ఫూర్తితో ప్రకృతికి ప్రతీకగా మారథాన్ టీ-షర్ట్ రంగులు రూపొందించినవని వివరించారు.“మానసిక ఉల్లాసాన్ని పొందడానికి, ఒత్తిడిని అధిగమించడానికి మాదకద్రవ్యాల అవసరం లేదు. ఒక కిలోమీటరు అయినా, మారథాన్ అయినా మనస్ఫూర్తిగా పరుగెత్తడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకుని సహజమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని పొందవచ్చు. మాదకద్రవ్యాల రహిత విశాఖపట్నం కోసం మనమందరం పరుగును అలవాటు చేసుకుందాం.”అన్నారు
ఈ ఏడాది నిర్వహిస్తున్న సంధ్యా మెరైన్స్ వైజాగ్ మారథాన్‌కు AIMS (అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారథాన్స్ అండ్ డిస్టెన్స్ రేసెస్) గుర్తింపు పొందిన రన్నింగ్ కోర్సు ఉండటం గర్వకారణమని తెలిపారు. అంతేకాక వైజాగ్ రన్నర్స్ సొసైటీ AIMS సభ్యత్వాన్ని కలిగి ఉందని, ఈ ముఖ్యమైన మైలురాయితో సంధ్యా మెరైన్స్ వైజాగ్ మారథాన్ అంతర్జాతీయ మారథాన్ క్యాలెండర్‌లో స్థానం సంపాదించనుందని ఈ సందర్భంగా వైజాగ్ రన్నర్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బాలకృష్ణ రాయ్ కీలక విషయాన్ని ప్రకటించారు.
నగర ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు వైజాగ్ రన్నర్స్ సొసైటీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిపుణులైన కోచ్‌ల ఆధ్వర్యంలో ఉచిత శక్తి పెంపు వ్యాయామ శిక్షణ తరగతులు. & వైజాగ్ ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహనకు ప్రతి నెలా క్లబ్ రన్స్ నిర్వహిస్తుంది. డాక్టర్ మాధురి పల్లి నేతృత్వంలో నిర్వహిస్తున్న కౌచ్ టు 5K రన్నింగ్ ప్రోగ్రామ్ మంచి పురోగతిని సాధిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన రన్నర్లు ప్రస్తుతం రాబోయే 5వ సంధ్యా మెరైన్స్ వైజాగ్ మారథాన్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ ఏడాది శ్రీ రాణా ఉప్పలపాటి ఆలోచనతో రూపొందించిన PAW (Paint a Wish) కార్యక్రమాన్ని పాఠశాలల ద్వారా నిర్వహించడం ప్రారంభించారు. సృజనాత్మకతను, వారి హృదయపూర్వక అనుభవాలను ప్రతిబింబించే చిత్రాలకు బహుమతులు అందించే కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనున్నారు.
ఈ టి-షర్టు & మెడల్స్ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, స్పాన్సర్లు శ్రీ కె. ఆనంద్ – టైటిల్ స్పాన్సర్, డైరెక్టర్, సంధ్యా మెరైన్స్, శ్రీ కె. అరుణ్ – టైటిల్ స్పాన్సర్, డైరెక్టర్, సంధ్యా మెరైన్స్, డాక్టర్ కృష్ణ ప్రసాద్ – చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, అపోలో హాస్పిటల్స్, అరిలోవ, శ్రీ ప్రభు కిషోర్ వల్లూరుపల్లి మరియు శ్రీమతి లక్ష్మి – ఆతిథ్య భాగస్వాములు, నోవోటెల్, శ్రీ శ్రీనివాస్ దుద్దుపూడి – ఛైర్మన్, శ్రీ కన్యా ఐరన్ అండ్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ రవి కట్టా – సైట్ క్వాలిటీ హెడ్, ఫైజర్, విశాఖపట్నం, శ్రీ టీవీఎన్ సత్యమూర్తి – టాటా కాపర్ ప్రతినిధి హాజరై తమ మద్దతును వ్యక్తపరిచారు.
“ఈ మారథాన్ నిర్వహణకు సహకారం అందిస్తున్న సంధ్యా మెరైన్స్‌కు మా హృదయపూర్వక ధన్యవాదాలు. CMR, నోవోటెల్, అపోలో హాస్పిటల్స్‌తో పాటు మానసిక ఆరోగ్య అవగాహన కోసం నిర్వహిస్తున్న వైజాగ్ మారథాన్‌కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీ అందరి సహకారంతోనే ఈ మారథాన్‌ను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాం.” అన్నారు వైజాగ్ రన్నర్స్ సొసైటీ కార్యదర్శి శ్రీ రామరాజు డి.వి. (అవినాష్).
వైజాగ్ మారథాన్ 29 నవంబర్ 2026న 5K – 5 కిలోమీటర్లు, 10K – 10 కిలోమీటర్లు, 21K – 21 కిలోమీటర్లు & 32K – 32 కిలోమీటర్లు పరుగు విభాగాలలో నిర్వహిస్తారు. ఈ మారథాన్‌ పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ప్రారంభమై ప్రసిద్ధ అక్వేరియం, రోప్‌వే వంటి ప్రదేశాల మీదుగా సాగి, ఫిల్మ్ నగర్ క్లబ్ వద్ద మలుపు తీసుకుని, చివరగా వీఎంఆర్‌డీఏ పార్క్ వద్ద ముగుస్తుంది.
మారథాన్‌లో పాల్గొనే వారి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని అపోలో హాస్పిటల్స్ ప్రతి రెండు కిలోమీటర్లకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచుతుంది. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 31 అక్టోబర్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: www.vizagmarathon.run & ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్: ప్యూమా స్టోర్, వీఐపీ రోడ్, విశాఖపట్నం.
ఆరోగ్యవంతమైన, ఆనందభరితమైన విశాఖపట్నం కోసం మనమందరం కలసి పరుగుకు సిద్ధమవుదాం.
వైజాగ్ రన్నర్స్ సొసైటీ

Related Videos

42వ వార్డులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. కాబోయే డిప్యూటీ మేయర్ కోడిగుడ్ల పూర్ణిమ:
Oct 29, 2026

42వ వార్డులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. కాబోయే డిప్యూటీ మేయర్ కోడిగుడ్ల పూర్ణిమ:

*42వ వార్డులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. కాబోయే డిప్యూటీ మేయర్ కోడిగుడ్ల పూర్ణిమ: మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి* -42వ వార్డు అభ్…

Watch Now
ప్రజల మద్దతుతోనే ఘన విజయం సాధిస్తాం.. 35వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి*
Oct 29, 2026

ప్రజల మద్దతుతోనే ఘన విజయం సాధిస్తాం.. 35వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి*

*ప్రజల మద్దతుతోనే ఘన విజయం సాధిస్తాం.. 35వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి* విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలోని 35వ వార…

Watch Now