--:-- | Today 28°C · Weather
Breaking

భక్తిశ్రద్ధలతో సత్యనగర్‌లో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు

Oct 19, 2026 1:57 47 views 3

Description

భక్తిశ్రద్ధలతో సత్యనగర్‌లో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు

పూర్ణా మార్కెట్, సత్యనగర్‌లో శ్రీ రామాంజనేయ యువజన సేవా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిపారవశ్యంతో వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారి కృపాకటాక్షాలు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ భారీ అన్నసమారాధన కార్యక్రమానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వెంకటరమణ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

అమ్మవారి సేవలో భాగంగా నిర్వహిస్తున్న అన్నసమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. అమ్మవారి నామస్మరణలు, పూజలు, సేవా కార్యక్రమాలతో సత్యనగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. 🙏

Related Videos

విశాఖ దక్షిణ నియోజకవర్గం  37 వ వార్డు తరపు నుంచి టిడిపి అభ్యర్థిగా నామినేషన్ వేసిన బుచ్చా శ్రీను.
Oct 19, 2026

విశాఖ దక్షిణ నియోజకవర్గం 37 వ వార్డు తరపు నుంచి టిడిపి అభ్యర్థిగా నామినేషన్ వేసిన బుచ్చా శ్రీను.

విశాఖ దక్షిణ నియోజకవర్గం 37 వ వార్డు తరపు నుంచి టిడిపి అభ్యర్థిగా నామినేషన్ వేసిన బుచ్చా శ్రీను. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు నాయుడు…

Watch Now
విశాఖ దక్షిణ నియోజవర్గం 33 వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి  నామినేషన్ వేసిన బంగారు రవిశంకర్
Oct 19, 2026

విశాఖ దక్షిణ నియోజవర్గం 33 వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి నామినేషన్ వేసిన బంగారు రవిశంకర్

విశాఖ దక్షిణ నియోజవర్గం 33 వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి నామినేషన్ వేసిన బంగారు రవిశంకర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. డిప్యూటీ సీఎం ప…

Watch Now