టీడీపీ మేయర్ రెబల్ అభ్యర్థిగా పులిచెర్ల రాజేశ్వరి పార్టీ అధిష్ఠానం తమ సేవలను గుర్తించలేదని
Description
టీడీపీ మేయర్ రెబల్ అభ్యర్థిగా పులిచెర్ల రాజేశ్వరి
పార్టీ అధిష్ఠానం తమ సేవలను గుర్తించలేదని ఆవేదన
విశాఖ :
జీవీఎంసీ మేయర్ పదవికి తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా పులిచెర్ల రాజేశ్వరి నామినేషన్ దాఖలు చేసినట్లు ప్రకటించారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ఆశీస్సులతో మేయర్ ఎన్నికకు సిద్ధమైనట్లు తెలిపారు.
ఎన్టీఆర్ హయాం నుంచి సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్నప్పటికీ, పార్టీ అధిష్ఠానం తమ సేవలను గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జీవీఎంసీ కార్పొరేటర్‌గా, ఫ్లోర్‌లీడర్‌గా పనిచేసి ప్రజలకు అనేక సేవలు అందించినట్లు పేర్కొన్నారు.
జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని రాజేశ్వరి తెలిపారు. వివిధ వార్డులకు చెందిన నాయకుల సహకారంతోనే మేయర్ పదవికి నామినేషన్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు. తన రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం తనకు మద్దతుగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Videos
Oct 27, 2026
వైఎస్సార్ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…
Watch Now
Oct 27, 2026
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…
Watch Now