అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
Description
*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
- 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం
- ఫ్యాన్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి
- ఎన్నికల ప్రచారంలో వైసీపీ 42 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పూర్ణిమ విజ్ఞప్తి
గడచిన ఐదేళ్ల కాలంలో వార్డును అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని, రాబోయే కాలంలో మరింత మెరుగైన అభివృద్ధి, పరిపాలన అందించడమే ధ్యేయంగా మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నానని 42 వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ పేర్కొన్నారు. వార్డు పరిధిలోని కాలనీల్లో ఆమె స్థానికులతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణిమ శ్రీధర్ లు మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో ఎంతో నిబద్ధతతో ప్రజలకు అందుబాటులో ఉంటూ దాదాపు 18 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను పూర్తి చేశామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దే సంకల్పంతోనే రెండోసారి కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత 15 రోజులుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆమె తెలిపారు. ప్రజల అవసరాలు, వారి సలహాలు సూచనలు తెలుసుకుని భవిష్యత్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నారు. వార్డులో స్థలాభావం ఉన్నందున స్థానికులకు అందుబాటులో ఉండేలా చిన్నపాటి మిని కళ్యాణ మండపం లేదా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా సేవకురాలినని, తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణితో పాటు కార్పొరేటర్‌గా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వేలంగినిరావు, మహిళా కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Previous#vvwnews #latestnews గతంలో మీ హయాంలో ఎలక్షన్స్ ఎలా జరిగాయో గుర్తు లేదా ll
Nextవైఎస్సార్ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
Related Videos
Oct 27, 2026
వైఎస్సార్ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…
Watch Now