--:-- | Today 28°C · Weather
Breaking

62వ వార్డు అభివృద్ధి కూటమితోనే సాధ్యం.. కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్ విస్తృత ప్రచారం..*

Oct 26, 2026 2:46 9 views 1

Description

*62వ వార్డు అభివృద్ధి కూటమితోనే సాధ్యం.. కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్ విస్తృత ప్రచారం..*

62వ వార్డు సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని కూటమి కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వార్డు పరిధిలోని కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా నీరుకొండ దివాకర్ మాట్లాడుతూ.. వార్డు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, భారీ మెజారిటీతో విజయం సాధిస్తామన్న పూర్తి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డులో దాదాపు 3.70 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. తనకు అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ శ్రీభరత్, జనసేన నార్త్ ఇన్‌ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్, సిటీ ఇన్‌ఛార్జ్ వంశీకృష్ణ యాదవ్ తదితర కూటమి పెద్దలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని బ్యాలెట్ క్రమసంఖ్య 2 లో ఉన్న గాజు గ్లాసు గుర్తుకు, మేయర్ కూటమి అభ్యర్థిని ముక్కా శ్రావణికి క్రమసంఖ్య 3 సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన వార్డు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Videos

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
Oct 27, 2026

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.

రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…

Watch Now
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
Oct 27, 2026

అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*

*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…

Watch Now