--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కన రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న 150 సంవత్సరాల మర్రిమానుకు విత్తనాల

Aug 2, 2026 11:58 7 views 2

Description

మన స్నేహం వృక్షాలతో భూమితో అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పేర్కొన్నారు. విశాఖ నగరంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కన రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న 150 సంవత్సరాల మర్రిమానుకు విత్తనాల రాఖీలను కట్టి ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. వనమాలి, సిటిజి, ఐ ఐ ఏ ఎం, యాక్షన్ ఎయిడ్, రోటరీ కపుల్స్ తదితర సంస్థలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రత్నం మాట్లాడుతూ ఈరోజు నుంచి ఆగస్టు 28 వరకు వృక్షాబంధన దినోత్సవాలు నిర్వహించాలని కోరుతూ, తాము విత్తనాల రాఖీలు తయారు చేయడం, రక్షాబంధన కార్యక్రమాలు నిర్వహించడం, తాటి పండ్లతో తాటి వనాల పెంచేందుకు కృషి చేస్తామన్నారు. గత ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు విత్తనాల రాఖీ లను ప్రోతసహిస్తామన్నారని రత్నం వివరించారు.
వనమాలి సిటిజి అడ్మిన్ మళ్ళ సరిత మాట్లాడుతూ ప్రకృతి వనరులను కాపాడుకుందాం, భూమాతను పరిరక్షిద్దాం అని అన్నారు. వందల సంవత్సరాల క్రిందట బిష్ణోయి తెగ చెట్లకు పవిత్ర దారాలు కట్టే కాపాడారన్నారు. వందల ఏళ్ల నాటి చెట్లను కాపాడటానికి మహిళలు ఎందరో బలయ్యారు అని వివరించారు. అందుకే మనందరం చెట్లను కాపాడుకోవాలని, అడవులను పరిరక్షించాలని కోరారు.
ఐఐఎఎం ప్రొఫెసర్ డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న శీతోష్ణస్థితిని దృష్టిలోనికి తీసుకుని అడవులను కాపాడుకుందాం, తాటి వనాలను పెంచుదాం, తాటితోపులను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ ఈ రోజు నుంచి ఆగస్టు 28 వరకు నిర్వహించె వృక్షాబంధన్ దినోత్సవాలలో తమ విద్యార్థులనూ భాగస్వాములు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రోటరీ కపుల్స్ ప్రతినిధులు శోభన ప్రకాష్ , యాక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి ఐ కృష్ణ కుమారి, మేంగొమేన్ అప్పాజీ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ సమన్వయకర్త జె రాజేశ్వరి, పలువురు స్వచ్చంద సేవకులు పాల్గొన్నారు.

Related Videos