--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖపట్నంలోని బర్మా కాందిశీకుల భూములపై భూకబ్జాదారులు కన్నేశారని#vvwnews

Jul 6, 2026 8:06 9 views 1

Description

విశాఖపట్నంలోని బర్మా కాందిశీకుల భూములపై భూకబ్జాదారులు కన్నేశారని, దొంగ డాక్యుమెంట్లతో కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని బర్మా ఆంధ్రా కాందిశీకుల పునరావాస కేంద్ర సంఘం నేతలు ఆరోపించారు. ఈ సందర్బంగా కంచరపాలెం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బర్మా ఆంధ్ర కాందిశీకుల కేంద్ర సంఘం అధ్యక్షులు మారాజు, ప్రధాన కార్యదర్శి గునుపూడి అరుణ్ బాబు మాట్లాడారు.. గతంలో బర్మా నుండి వచ్చిన సుమారు 7,522 తెలుగు కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం విశాఖకు తీసుకువచ్చి ఇళ్లు, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అందులో భాగంగా 49వ వార్డు బర్మా కాలనీలో 9 ఎకరాల 50 సెంట్ల భూమిని కేటాయించగా.. నిధుల కొరత వల్ల కొన్ని ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. ఇలాంటి తరుణంలో కొంతమంది భూకబ్జాదారులు నకిలీ పత్రాలు సృష్టించి, స్థానిక కాందిశీకులను కొనుగోలు చేసి ఖాళీ స్థలాలను ఆక్రమించాలని చూస్తున్నారన్నారు. దీనిపై పోరాడుతున్న బర్మా కాందిశీకుల పునరావాస సంక్షేమ సంఘంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Related Videos