--:-- | Today 28°C · Weather
Breaking

డైమండ్ పార్కలో మూడో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌తో విశాఖపట్నంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసిన హోమ్‌లేన్*

Jul 6, 2026 5:55 4 views 1

Description

*Press Release:*

*డైమండ్ పార్కలో మూడో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌తో విశాఖపట్నంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసిన హోమ్‌లేన్*

*విశాఖపట్నం, జూలై 5, 2026:* భారతదేశపు ప్రముఖ టెక్, ఏఐ ఆధారిత హోమ్ ఇంటీరియర్స్ బ్రాండ్‌గా ఖ్యాతి గడించిన హోమ్‌లేన్ ఇప్పుడు విశాఖపట్నంలో తన మూడో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ ప్రారంభించడం ద్వారా, నగరంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసింది. అధిక వృద్ధి అవకాశాలు ఉన్న టైర్-2 నగరాలపై దృష్టి సారించడంలో భాగంగా, ఈ కొత్త కేంద్రంతో తన వ్యూహాన్ని ఈ సంస్థ మరింత బలోపేతం చేసింది.

విశాఖపట్నంలోని ప్రముఖ నివాస, వాణిజ్య ప్రాంతాల్లో ఒకటైన డైమండ్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అనేది సాంకేతికత ఆధారిత, డిజైన్-కేంద్రిత, వ్యవస్థీకృత హోమ్ ఇంటీరియర్ పరిష్కారాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో హోమ్‌లేన్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. నగరంలో తన ఉనికిని విస్తరించడం ద్వారా, విశాఖపట్నం అంతటా మరింత మంది గృహ యజమానులకు నిరంతరాయ ఎండ్-టూ-ఎండ్ ఇంటీరియర్ డిజైన్ సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, సమగ్ర హోమ్ ఇంటీరియర్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో హోమ్‌లేన్ ముందుకు సాగుతోంది.

ఈ విస్తరణతో అధిక వృద్ధి అవకాశాలు ఉన్న మార్కెట్లలో హోమ్‌లేన్ తన అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌తో విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్న రెండు కేంద్రాల నెట్‌వర్క్ మరింత బలోపేతమైంది. అలాగే, ఫ్రాంచైజీ యాజమాన్యం–ఫ్రాంచైజీ నిర్వహణ (FOFO) విధానంలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా 100 స్టూడియోలకు చేరుకోవాలన్న హోమ్‌లేన్ దీర్ఘకాలిక వ్యూహానికి ఈ విస్తరణ ఊతమిస్తుంది. వ్యవస్థీకృత, డిజైన్-ఆధారిత, సాంకేతికతతో కూడిన హోమ్ ఇంటీరియర్ పరిష్కారాలపై డిమాండ్ వేగంగా పెరుగుతున్న అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తన ఉనికిని విస్తరించడంపై సంస్థ దృష్టి సారిస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు షుగర్ ఇండస్ట్రీస్ (చోడవరం) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ. పి. ఎస్. రామచంద్ర రాజు గారి సమక్షంలో హోమ్‌లేన్ ప్రతినిధులు, భాగస్వాములు మరియు స్థానిక వాటాదారుల సమక్షంలో ఈ స్టూడియో ప్రారంభించబడింది.

శ్రీ వంశీ దీపక్ టీఎస్‌వీ భాగస్వామ్యంతో ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ భాగస్వామ్యం ద్వారా స్థానిక మార్కెట్‌పై ఉన్న అవగాహనను, హోమ్‌లేన్‌కు ఉన్న డిజైన్ నైపుణ్యం, ఫ్యాక్టరీ మద్దతుతో కూడిన అమలు సామర్థ్యం, సాంకేతికత ఆధారిత ప్రణాళికతో సమన్వయం చేసి, వినియోగదారులకు సజావుగా వుండే, నాణ్యమైన, వృత్తిపరంగా నిర్వహించే హోమ్ ఇంటీరియర్ అనుభవాన్ని అందించనుంది.

సుమారు 1,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన డైమండ్ పార్క్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, గృహయజమానులకు సమగ్ర, ఎండ్-టూ-ఎండ్ ఇంటీరియర్ డిజైన్ అనుభవాన్ని అందిస్తుంది. ఇక్కడ వినియోగదారులు హైపర్-రియలిస్టిక్ డిస్‌ప్లేల ద్వారా మాడ్యులర్ కిచెన్లు, వార్డ్‌రోబ్‌లు, పూర్తి హోమ్ ఇంటీరియర్ పరిష్కారాలను ప్రత్యక్షంగా చూడటంతో పాటు, ప్రీమియం మెటీరియల్స్‌ను స్వయంగా పరిశీలించవచ్చు. అలాగే, సాంకేతికత ఆధారిత డిజైన్ కన్సల్టేషన్‌ల ద్వారా తమ కలల ఇంటి రూపురేఖలు నిజ రూపం దాల్చడానికి ముందే వాటిని కళ్లకు కట్టినట్టుగా దృశ్యరూపంలో చూసే అవకాశం పొందుతారు. కాన్సెప్ట్ రూపకల్పన నుంచి ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ఇంటీరియర్ డిజైన్ ప్రక్రియలోని ప్రతి దశకు ఒకేచోట వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం, సమగ్ర సేవలను ఈ స్టూడియో అందిస్తుంది.

హోమ్‌లేన్‌కు చెందిన యాజమాన్య ఏఐ ఆధారిత ప్లాట్‌ఫారమ్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా గృహయజమానులు తమ ఇంటి ఇంటీరియర్లను 3D రూపంలో ముందుగానే వీక్షించడంతో పాటు, తక్షణ ధరల అంచనాలను పొందవచ్చు. డిజైన్ నుంచి అమలు వరకు సజావుగా వుండే, సులభమైన అనుభవాన్ని ఈ ప్లాట్‌ఫారమ్ అందిస్తుంది. అదనంగా, పారదర్శక ధరల విధానం, 45 రోజుల డెలివరీ హామీ, 10 సంవత్సరాల మెటీరియల్ వారంటీ, అలాగే ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఎండ్-టూ-ఎండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ మద్దతు వంటి ప్రయోజనాలను కూడా వినియోగదారులు పొందుతారు.

హోమ్‌లేన్‌ సహ వ్యవస్థాపకుడు మరియు సిఒఒ శ్రీ తనుజ్ చౌదరి మాట్లాడుతూ, "పెరుగుతున్న గృహ యాజమాన్యం, అలాగే వృత్తిపరంగా నిర్వహించే హోమ్ ఇంటీరియర్ పరిష్కారాలపై పెరుగుతున్న ఆసక్తి కారణంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లోని కీలక హోమ్ ఇంటీరియర్ మార్కెట్లలో ఒకటిగా వేగంగా ఎదుగుతోంది. డైమండ్ పార్క్‌లో మా కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం ద్వారా, సాంకేతికత ఆధారిత, డిజైన్-కేంద్రిత, వ్యవస్థీకృత ఇంటీరియర్ పరిష్కారాలను మరింత మంది గృహయజమానులకు చేరువ చేయాలన్న మా నిబద్ధతను మరోసారి చాటుతున్నాం. పారదర్శకమైన, సజావుగా వుండే, సులభమైన డిజైన్ ప్రయాణం ద్వారా మరిన్ని కుటుంబాలు తమ కలల ఇంటిని సాకారం చేసుకునేలా తోడ్పడాలని మేము ఆశిస్తున్నాం" అన్నారు.

ఈ భాగస్వామ్యం గురించి శ్రీ వంశీ దీపక్ టిఎస్వి మాట్లాడుతూ, "నేటి గృహ యజమానులు సృజనాత్మకతతో పాటు విశ్వసనీయత, నాణ్యమైన అమలును అందించే ఇంటీరియర్ డిజైన్ పరిష్కారాలను కోరుకుంటున్నారు. హోమ్‌లేన్‌తో మా భాగస్వామ్యం ద్వారా విశాఖపట్నంలోని వినియోగదారులకు ప్రపంచ స్థాయి సాంకేతికత, అత్యుత్తమ డిజైన్ నైపుణ్యం, క్రమబద్ధమైన అమలు ప్రక్రియను అందించగలుగుతాము. ప్రతి గృహయజమానికి ఇంటి రూపాంతర ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ, ఉత్తమమైన ఇంటీరియర్ అనుభవాన్ని అందించడానికి మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాం" అన్నారు

Related Videos