--:-- | Today 28°C · Weather
Breaking

వన్యప్రాణి వారోత్సవాలను జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి

Oct 5, 2026 6:00 23 views 2

Description

వన్యప్రాణి వారోత్సవాలను జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం ఎంవిపి కాలనీలో సమతా డిగ్రీ కళాశాలలో వన్యప్రాణి పరిరక్షణ కార్యక్రమాలు ప్రిన్సిపాల్ సారబంది, వైస్ ప్రిన్సిపాల్ శిల్ప నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ పుడమిపై ఉన్న సమస్త జీవరాశిని కాపాడండి అని కోరారు. ఏ జీవరాశి అంతరించిన మానవాళికే నష్టం అని హెచ్చరించారు. ప్రతి పల్లెలో పది ఎకరాలలో ఒక చిట్టడివి పెంచి రైతులకూ పంటలకూ ఉపకరించే జీవులు జీవించేందుకు కృషి చేయాలని కోరారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 8 వరకు జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడతాయన్నారు. జీవవైవిధ్య పరిరక్షణ, అంతరించిపోతున్న అరుదైన జంతువులు, పక్షుల రక్షణ మరియు ప్రకృతి సమతుల్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం అని వివరించారు. మానవ-వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించి, ప్రకృతితో కలిసి జీవించేలా ప్రజలను ప్రోత్సహించడం మన బాధ్యత అని వివరించారు.
ప్రిన్సిపల్స్ సారబంది మాట్లాడుతూ వన్యప్రాణి వారోత్సవాల తొలి ఆలోచన భారత ప్రభుత్వం 1952లో 'భారత వన్యప్రాణి బోర్డు' ను ఏర్పాటు చేసింది అన్నారు. ఈ బోర్డే వన్యప్రాణుల రక్షణపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచడానికి ఒక ప్రత్యేక రోజును కేటాయించాలనే ఆలోచనను ముందుకు తెచ్చిందన్నారు. అయితే మొదటి వన్యప్రాణి దినోత్సవం 1955లో ఒక రోజు పాటు "వన్యప్రాణి దినోత్సవం"గా నిర్వహించారన్నారు. కానీ 1957లో వన్యప్రాణుల సంరక్షణ అనేది ఒక్క రోజుతో ముగిసేది కాదని, దీనిపై విస్తృత అవగాహన అవసరమని భావించి వారోత్సవాలుగా (వైల్డ్ లైఫ్ వీక్) మార్చారని పేర్కొన్నారు. అది అహింసను బోధించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న ఈ వారోత్సవాలు ప్రారంభం కావడం దీని ప్రత్యేక విశిష్టత. గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని మూగజీవాల రక్షణకు కూడా అన్వయిస్తూ ఈ విధంగా నిర్వహించడం జరిగుతోందని వివరించారు.
వైస్ ప్రిన్సిపాల్ శిల్ప మాట్లాడుతూ అడవుల నరికివేత, అక్రమ వేట వల్ల మూగజీవాలకు జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించడం అవసరం అన్నారు. అంతరించిపోతున్న పులులు, ఏనుగులు, సింహాలు వంటి అడవి జంతువుల ఆవాసాలను కాపాడటం మన బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సమత కాలేజ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ శ్రీదేవి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రామకృష్ణ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో సమన్వయకర్త జె రాజేశ్వరి, పలువురు విద్యార్థులు మాట్లాడారు

Related Videos

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న వాడబలిజ మత్స్యకార సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం
Oct 5, 2026

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న వాడబలిజ మత్స్యకార సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం

👉🏿 👉🏿👉🏿 తీరప్రాంత వాడబలిజ (మత్స్యకార) సంక్షేమ సంఘం, విశాఖపట్నం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న వాడబలిజ మత్స్యకార సామాజిక వర్గాని…

Watch Now
వైభవంగా చకోర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ || Event By VEERUMAMA
Oct 5, 2026

వైభవంగా చకోర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ || Event By VEERUMAMA

* విశాఖపట్నం అక్టోబర్ 03: విశాఖపట్నం, ఆర్కే బీచ్ లో హైజాయ్ ఎంటర్టైన్మెంట్ చిత్ర నిర్మాత సిహెచ్ రామారావు ఆధ్వర్యంలో మంగా శ్రీనివాస్ దర్శకత్వం…

Watch Now