--:-- | Today 28°C · Weather
Breaking

జ్ఞానపురం అభివృద్ధి ప్రజల ఆరోగ్య పరిరక్షణే మా లక్ష్యం.. 42వ వార్డు వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి l

Oct 23, 2026 6:43 20 views 2

Description

విశాఖ *జ్ఞానపురం అభివృద్ధి ప్రజల ఆరోగ్య పరిరక్షణే మా లక్ష్యం.. 42వ వార్డు వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్*

జ్ఞానాపురం ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంతో పాటు స్థానిక ప్రజల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని 42వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ స్పష్టం చేశారు. జ్ఞానాపురంలో జేఎన్ఎన్ఆర్ యుఎం కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.. రైల్వే స్టేషన్, పాఠశాలల సమీపంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణరక్షణ కోసం కౌన్సిల్ ద్వారా ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అత్యవసర వైద్యం అందక రోగులు ప్రాణాలు కోల్పోకుండా స్థానికంగా పేదల కోసం 24 గంటల ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామన్నారు. వర్షాకాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని చెప్పారు. తమను గెలిపిస్తే వార్డును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. తమ అమూల్యమైన ఓటును మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణికి, కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు.

Related Videos

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
Oct 27, 2026

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.

రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…

Watch Now
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
Oct 27, 2026

అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*

*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…

Watch Now