*ఇంటింటికీ యోగా, అందరికీ ఆరోగ్యం.. జ్యోతినగర్‌లో వైభవంగా గురు పౌర్ణమి యోగా మహోత్సవం..*
యోగా అనేది కేవలం వ్యాయామం కాదు.. అదొక ఆరోగ్యకరమైన జీవన విధానమని, హరిద్వార్‌కు చెందిన ప్రముఖ యోగా గురువు స్వామి రామ్‌దేవ్ బాబా ఆశయాలకు అనుగుణంగా.. ఇంటింటికీ యోగా అందరికీ ఆరోగ్యం అనే గొప్ప సంకల్పంమని పతంజలి యోగా సమితి సభ్యులు తెలిపారు. మర్రిపాలెం జ్యోతినగర్ వాకర్స్ పార్క్ వద్ద గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా పతాంజలి యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ దేవుడు బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..
ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా ప్రతి ఒక్కరికీ ఉచితంగా యోగాను అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 5 యోగా కేంద్రాలను విజయవంతంగా ప్రారంభిస్తూ, నిరంతరం ప్రజలను చైతన్యపరుస్తున్నారన్నారు. ఈ స్ఫూర్తితో ఇక్కడి పిల్లలు యోగాసన క్రీడల్లో పాల్గొని గోల్డ్, బ్రాంజ్ మెడల్స్ సాధించడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. గత 46 సంవత్సరాలుగా యోగా సాధన చేస్తూ, గురువుల ప్రోత్సాహంతో ఈ ప్రాంతంలో యోగా కేంద్రాలు నిరంతరాయంగా సాగడానికి కృషి చేస్తున్న పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ పార్క్ అధ్యక్షులు రవి, రత్తయ్య, అధిక సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు.