--:-- | Today 28°C · Weather
Breaking

ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టుల జాతీయ సదస్సు#vvwnews

Jul 4, 2026 3:49 11 views 1

Description

ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టుల జాతీయ సదస్సు
విశాఖపట్నం 3 జూలై 2026: ఇండియన్ సొసైటీ ఆఫ్ వాస్కులర్ & ఇంటర్వెన్షనల్ రేడియాలజీ (ISVIR) యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ శాఖ తమ జాతీయ మధ్యంతర శాస్త్రీయ సదస్సును జూలై 2 నుండి 4 వరకు బీచ్ రోడ్ లోని నోవాటెల్ హోటల్ నందు నిర్వహిస్తున్నారు. ఈ జాతీయ సదస్సును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ గౌరవ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ప్రముఖ వృత్తిపరమైన సంస్థ. మూడు రోజుల పాటు నిర్వహించు సదస్సుకు భారతదేశం నలుమూలల నుండి ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు హాజరై మినిమల్లీ ఇన్వాసివ్ ఇమేజ్-గైడెడ్ చికిత్సలోని తాజా పురోగతుల గురించి చర్చించి ఉత్తమ చికిత్సా విధానాలు పరస్పరం పంచుకోవటం మరియు రోగి భద్రతను, చికిత్సా ఫలితాలను మరింత మెరుగుపరచు చర్యల గురించి అవగాహన పొందు లక్ష్యంగా నిర్వహిస్తున్నారు.
అంతేకాక మినిమల్లీ ఇన్వాసివ్ ఇమేజ్-గైడెడ్ చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించుటకు ఇండియన్ సొసైటీ ఆఫ్ వాస్కులర్ & ఇంటర్వెన్షనల్ రేడియాలజీ (ISVIR) సదస్సులో భాగంగా ఒక వాకథాన్‌ను నిర్వహించనున్నాది. ఈ వాకథాన్‌ను శ్రీ మథుకుమిల్లి శ్రీభారత్, విశాఖ పార్లమెంట్ సభ్యులు మరియు శ్రీ శంఖ బ్రత బాగ్చీ విశాఖ నగర పోలీస్ కమిషనర్ తో కలిసి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా అనేక వ్యాధులకు పెద్ద శస్త్రచికిత్స లేకుండా చికిత్స చేయవచ్చనే అవగాహన కల్పించాతమే ఈ వాకథాన్ ప్రధాన లక్ష్యం. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న వైద్య విభాగాలలో ఒకటి. ఇది సాంప్రదాయ శస్త్రచికిత్సకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా అనేక సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. అల్ట్రాసౌండ్, సిటి స్కాన్, మరియు యాంజియోగ్రఫీ వంటి అధునాతన ఇమేజింగ్ మార్గదర్శకత్వాన్ని ఉపయోగించి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు పెద్ద శస్త్రచికిత్స కోతలను నివారించి, ఒక చిన్న సూది లేదా ఒక చిన్న కాథెటర్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తారు. బ్రెయిన్ స్ట్రోక్, కాలేయ మరియు ఇతర క్యాన్సర్లు, గర్భాశయ ఫైబ్రాయిడ్లు, ప్రోస్టేట్ గ్రంథి వాపు (BPH), వెరికోస్ వీన్స్, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, డయాలసిస్ యాక్సెస్ సమస్యలు, వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ వంటి అనేక క్లిష్టమైన వ్యాధులతో సహా అనేక సమస్యలకు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పద్ధతుల ద్వారా సురక్షితంగా మరియు సమర్థవంతంగా చికిత్స చేయవచ్చును
దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఒకచోట చేర్చడం ద్వారా, మేము జ్ఞానాన్ని పంచుకోవడం, ఉత్తమ పద్ధతులపై చర్చించడం మరియు రోగులకు అత్యంత సురక్షితమైన, ప్రభావవంతమైన మినిమల్లీ ఇన్వాసివ్ చికిత్సలు అందేలా చూడటం లక్ష్యంగా పెట్టుకున్నాము. మా పబ్లిక్ అవేర్‌నెస్ వాకథాన్ ద్వారా, ఒకప్పుడు శస్త్రచికిత్స అవసరమైన అనేక వ్యాధులకు ఇప్పుడు ఇమేజ్-గైడెడ్ విధానాల ద్వారా వేగవంతమైన కోలుకోవడం మరియు మెరుగైన ఫలితాలతో చికిత్స చేయవచ్చని ప్రజలకు తెలియజేయాలని కూడా మేము ఆశిస్తున్నాము." అన్నారు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ మరియు ISVIR ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ బాలాజీ పటేల్ కోల.
ఈ సందర్భంగా ISVIR ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ చాప్టర్ కార్యదర్శి డాక్టర్ జిగ్నేష్ రెడ్డి మాట్లాడుతూ "ఈ జాతీయ శాస్త్రీయ సదస్సు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు పరస్పరం నేర్చుకోవడానికి, ఇటీవలి పురోగతులను చర్చించడానికి మరియు క్లినికల్ ప్రాక్టీస్‌ను మరింత బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన వేదిక అన్నారు. అంతేకాక అనేక రకాల వ్యాధులకు సురక్షితంగా, సమర్థవంతంగా పెద్ద శస్త్రచికిత్స లేకుండా చికిత్స చేయడంలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీల పాత్ర గురించి ప్రజలలో మరియు రెఫరింగ్ డాక్టర్లలో మరింత అవగాహన కల్పించడం మా లక్ష్యం అన్నారు"

Related Videos