తీరప్రాంత రక్షణకు ప్రతి ఒక్కరు సహకరించండి అని విశాఖపట్నం జిల్లా అటవీ శాఖ రవీంద్ర దామా పిలుపునిచ్చారు
Description
తీరప్రాంత రక్షణకు ప్రతి ఒక్కరు సహకరించండి అని విశాఖపట్నం జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర దామా పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం సాగర్ నగర్ తీరం లో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ తీసుకు వచ్చిన తాటి పళ్ళు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. తీరం వెంబడి తాటి, సరుగుడు వనాలు పెంచుదాం అని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీరప్రాంతంలో ఒక పెద్ద గ్రీన్ బేరియర్ గా రక్షణ వనాలు పెంచాలని నిర్ణయించారని పేర్కొన్నారు. అందులో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ, గాయిత్రి విద్యా పరిషత్ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, రోటరీ కపుల్స్, గ్రీన్ క్లైమేట్ వాలంటీర్లు తో తాటి పళ్ళు నాటించడం జరిగింది అన్నారు. తమ సిబ్బంది ప్రణాళిక బద్ధంగా తాటి పళ్ళు నాటించడం జరిగింది అని వివరించారు. తీర ప్రాంతంలో తాటి పండ్లను నాటేందుకు విద్యార్థులు, స్వచ్చంద సేవా సంస్థలు తరలి రండి అని కోరారు. విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచుదాం, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ తీరప్రాంతంలో తుఫాన్ లు, ఉప్పెన లు, సునామీ లో నుండి రక్షణ కోసం షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్ చాలా అవసరం అని వివరించారు. అలాగే తాటి పళ్ళు అటవీ శాఖకు అందజేయాలని కోరారు. ఎక్కడ తాటి పళ్ళు ఉన్నా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ మొబైల్ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ 8333849955 చేయమని కోరారు. తీర ప్రాంతంలో నాటడానికి అధిక సంఖ్యలో తాటి పళ్ళు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సబ్ డిఎఫ్ఒ కడలి శ్రీవాణి, రోటరీ కపుల్స్ ప్రతినిధి సుధ, యాక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి ఐ కృష్ణ కుమారి, గాయిత్రి విద్యా పరిషత్ ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు

Previousజాల బిరాదారికంబాలకొండ అభయారణ్యం- ముడుసులో జలాశయ పరిరక్షణకు సంబంధించిన
Nextతీరప్రాంత రక్షణకు ప్రతి ఒక్కరు సహకరించండి అని విశాఖపట్నం జిల్లా అటవీ శాఖ రవీంద్ర దామా పిలుపునిచ్చారు
Related Videos
Aug 4, 2026
జాల బిరాదారికంబాలకొండ అభయారణ్యం- ముడుసులో జలాశయ పరిరక్షణకు సంబంధించిన
జాల బిరాదారి కంబాలకొండ అభయారణ్యం- ముడుసులో జలాశయ పరిరక్షణకు సంబంధించిన WP.(PIL) No. 137/2026 విచారణను ముందుకు జరుపడానికి గౌరవ హైకోర్టు అంగీక…
Watch Now
Aug 4, 2026
చిన్నారి సహస్ర కుటుంబానికి ఆర్క చేయూత* ll VVW NEWS
*చిన్నారి సహస్ర కుటుంబానికి ఆర్క చేయూత* *రూ.20 లక్షలు ఖర్చు చేసిన దక్కని పాప* *ఆర్ధిక సమస్యలతో ఆ కుటుంబం విలవిల* *సహకారం అందిస్తున్న దాతలు* …
Watch Now